women
Washington: అమెరికాలో పాపీ అనే మహిళ అరుదైన సమస్యతో బాధపడుతుంది. ఇప్పటికే ఎన్నోటెస్టులు చేయించుకుంది.. ట్రీట్ మెంట్లు తీసుకుంది. అయినా, వైద్యులెవరూ ఆమె సమస్యకు కారణం కనుగొనలేకపోయారు. అయితే, ఎట్టకేలకు మూడేళ్ల తరువాత వైద్యులు ఆమె సమస్యకు కారణాన్ని కనుగొన్నారు. ఆపరేషన్ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. దీంతో సదరు మహిళ ఆపరేషన్ కు సిద్ధమైంది. తన సమస్య త్వరలోనే తీరుతుందని సంతోషం వ్యక్తం చేసింది.
అమెరికాకు చెందిన పాపీ అనే మహిళకు వెయ్యి రోజులుగా రుతుస్రావం అవుతూనే ఉంది. సాధారణంగా మహిళలకు 21 రోజుల నుంచి 35రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. రెండు నుంచి ఏడు రోజులుదాకా రుతుస్రావ చక్రం కొనసాగుతోంది. ఒకవేళ హార్మోన్ లెవల్స్, ఒత్తిడి, సరియైన ఆహారం తీసుకోకపోవటం, ఇతర కారణాలతో రుతుస్రావం సమయాల్లో మార్పులు ఉంటాయి. కొందరు మహిళల్లో రుతుస్రావం ఎక్కువ రోజులు అవుతుంది. అయితే, పాపీ అనే మహిళకు వెయ్యి రోజులుగా రుతుస్రావం అవుతూనే ఉంది.
తన సమస్యను పరిష్కరించుకునేందుకు అనేక మంది వైద్యులను సంప్రదించింది. టెస్టులు చేయించుకుంది. సర్జికల్ ప్రొసీజర్లు కూడా జరిగాయి. అయినా, వైద్యులు ఆమె సమస్యకు పరిష్కారంను కనుగొనలేక పోయారు. బ్లీడింగ్ ను నియంత్రించేందుకు ఇంట్రాయుటిరైన్ డివైజ్ అమర్చినా ఫలితం లేదు. నాకెందుకు నాన్ స్టాప్ గా బ్లీడింగ్ అవుతున్నదో ఎవరికీ తెలియదు.. అని పాపీ ఒక వీడియోలో పేర్కొంది. అయితే, అనేక సార్లు ట్రీట్మెంట్ అనంతరం ఇటీవల ఆమె సమస్యకు కారణాన్ని వైద్యులు గుర్తించారు.
ఆమె బైకార్నుయేట్ యుటెరస్ తో బాధపడుతున్నట్లు డయాగ్నోస్ చేశారు. బైకార్ నేట్ యుటిరస్ అంటే గర్భాశయం హృదయంలాగా ఏర్పడి రెండు చాంబర్లుగా విడిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో ఐదు శాతం మందికి ఈ సమస్య వస్తుందని క్లీన్ ల్యాండ్ క్లీనిక్ తెలిపింది. అసలు తమకు ఈ సమస్య ఉన్నట్లు మహిళలకే తెలియదు. దీంతో సంతాన సమస్యలు రాడం, అదే పనిగా మిస్ క్యారేజ్, బ్లీడింగ్ కావడం వంటివి జరుగుతాయని వైద్యులు చెప్పారు. అయితే, తన సమస్యకు కారణం తెలిసిందని, హార్మోనల్ టెస్టు చేయించుకుంటానని, అలాగే తనలో అమర్చిన ఇంట్రా యుటిరైన్ డివైజ్ ను తీయించేసుకుంటానని పాపీ తెలిపింది.