Amla Juice is the best medicine for PCOD problem.
మారుతున్న జీవితశైలి, భోజన అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి వంటివి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ సమస్యలను పెంచుతున్నాయి. ముఖ్యంగా PCOD (Polycystic Ovarian Disease) సమస్య ఈ మధ్యకాలంలో యువతుల్లో ఎక్కువగా పెరుగుతోంది. ఈ సమస్య కారణంగా చాలా మంది సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్నారు. PCOD అనేది గర్భధారణలో ఇబ్బందులు, ముఖంపై ముంఛు (acne), మెన్స్ట్రుయల్ లోపాలు, బరువు పెరగడం లాంటి అనేక సమస్యలకు కారణమవుతుంది. కానీ, ఉసిరి PCOD సమస్యను నయం చేయడంలో ప్రభావవంతంగా పెనిచేస్తుందట. దాని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఉసిరికాయలో విటమిన్ C అధికంగా ఉంటుంది. దీని వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది, హార్మోన్ సమతుల్యతకు సహాయపడుతుంది. PCOD బాధితుల కోసం ఇది ఒక దివ్యౌషధంగా చెప్పుకోవచ్చు.
1.హార్మోన్ బ్యాలెన్స్:
ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. ఇది అండాశయాలలో సిస్టుల ఏర్పాటును తగ్గించడంలో సహాయపడుతుంది.
2.ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది:
PCOD ఉన్న మహిళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రధాన సమస్యగా ఉంటుంది. ఉసిరికాయ రసం శరీరంలోని షుగర్ మేటబాలిజాన్ని మెరుగుపరచి ఇన్సులిన్ యొక్క ప్రభావాన్ని పెంచుతుంది.
3.బరువు తగ్గేందుకు సహాయం:
ఉసిరికాయ శరీరంలో మెటబాలిజం వేగంగా పనిచేయడానికి దోహదపడుతుంది. ఇది బరువు తగ్గడంలో ప్రధానంగా పనిచేయడంతో పాటు, PCOD నిర్వహణకు సహాయపడుతుంది.
4.లివర్ డిటాక్సిఫికేషన్:
ఉసిరికాయ లివర్ ఫంక్షన్ ను మెరుగుపరచడంలో అద్భుతంగా పని చేస్తుంది. దీనివల్ల హార్మోన్ల సమతుల్యతను తిరిగి పొందడం సులభతరం అవుతుంది.
ఉసిరికాయ రసం లాంటి చిన్న చిట్కాలు మనం అందరికీ అందుబాటులో ఉండే సహజమైన మార్గాలు. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు, హార్మోన్ల సమతుల్యతకు కూడా సహకరిస్తాయి. సరైన జీవనశైలి, మంచి పోషక ఆహారం, మానసిక ప్రశాంతత లాంటివి PCOD సమస్యను నయం చేయడంలో సహాయపడతాయి.