Karela Juice Benefits: మ్యాజికల్ జ్యూస్.. ప్రతీరోజు ఒక గ్లాస్ తాగండి.. దెబ్బకు షుగర్ మొత్తం కంట్రోల్
Karela Juice Benefits: బ్లడ్ షుగర్ నియంత్రణలో కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. కాకరకాయలో ఉండే చరంతిన్, పొలిపెప్టైడ్-పీ శరీరంలోని గ్లూకోజ్ ను తగ్గించడంలో సహాయపడతాయి.

Bitter gourd juice works wonders for sugar problems
మధుమేహం (డయాబెటిస్) అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేస్తున్న దీర్ఘకాలిక వ్యాధి. అయితే ఈ వ్యాధిని కంట్రోల్ చేయడంలో ఆహారనియమాలు, వ్యాయామం చాలా అవసరం. కేవలం డాక్టర్లు సూచించే ఔషధాల వాడకం మాత్రమే కాదు ఆహారపు అలవాట్లు కూడా చాలా ప్రభావాన్ని చుపిస్తాయి. అందులో కాకరకాయ ఒకటి. ఇది నిజంగా షుగర్ కంట్రోలింగ్ కి దివ్యౌషధం అనే చెప్పాలి. దీనిలో ఉండే శక్తివంతమైన పోషకాలు మధుమేహాన్ని సహజంగా నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే కేవలం కాకరకాయను తినడమే కాదు దీని జ్యూస్ కూడా షుగర్ కంట్రోలింగ్ కి చాలా సహాయపడుతనదట. మరి వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కాకరకాయ జ్యూస్‌లో ఉండే ముఖ్యమైన పోషకాలు:
చరంతిన్: ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
పొలిపెప్టైడ్-పీ: ఇది ఇన్సులిన్ చర్యను కలిగించే సహజమైన ప్రోటీన్.
విటమిన్ A, C, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్: ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి.
కాకరకాయ జ్యూస్ ప్రయోజనాలు:
1.బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణ:
బ్లడ్ షుగర్ నియంత్రణలో కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. కాకరకాయలో ఉండే చరంతిన్, పొలిపెప్టైడ్-పీ శరీరంలోని గ్లూకోజ్ ను తగ్గించడంలో సహాయపడతాయి.
2.ఇన్సులిన్ ప్రతిస్పందనలో మెరుగుదల:
కాకరకాయ జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకోవడం వలన శరీరం ఇన్సులిన్‌ను బాగా అబ్సర్వ్ చేయగలదు. ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది.
3.వయసుతో వచ్చే మధుమేహ సమస్యలపై నియంత్రణ:
వృద్ధాప్యంలో మధుమేహ సమస్య ఎక్కువగా బాధిస్తుంది. కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వయస్సు కారణంగా వచ్చే ఇన్‌సులిన్ సమస్యలపై సమర్థంగా పని చేస్తాయి.
4. చర్మ సంబంధిత సమస్యలకు ఉపశమనం:
మధుమేహంతో బాధపడే వ్యక్తులకు చర్మ సమస్యలు సాధారణం. కాకరకాయ రక్తాన్ని శుద్ధి చేసి చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
5.తీవ్రత తగ్గించే సహజ మార్గం:
ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో షుగర్ స్థాయి సహజంగా తక్కువ అవుతుంది. ఇది ఔషధాల మీద ఆధారపడకుండానే నియంత్రణలోకి తెచ్చే సహజ మార్గంగా చెప్పొకోవచ్చు.
ఎలా తయారుచేసుకోవాలి:
- తాజా కాకరకాయ తీసుకొని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- మిక్సీలో వేసి నీరు కలిపి జ్యూస్ తయారుచేసుకోవాలి.
- రుచి కోసం తులసి ఆకులు, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు
- ప్రతి రోజు 30 మిల్లీ లీటర్ల నుంచి 50 మిల్లీ లీటర్ల మోతాదులో తీసుకోవాలి
జాగ్రత్తలు:
- అధిక మోతాదులో కాకరకాయ జ్యూస్ తీసుకుంటే షుగర్ లెవల్స్ పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ప్రమాదకరం.
- గర్భవతులు, చిన్నపిల్లలు కాకరకాయ జ్యూస్ తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
- ఎప్పుడూ మితంగా, నియమితంగా తీసుకోవాలి.
కాకరకాయ జ్యూస్ అనేది షుగర్ పేషెంట్స్ కోసం ఒక సహజ ఔషధం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో, గ్లూకోజ్ నియంత్రణలో, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే, ఎటువంటి సహజ చికిత్స అయినా డాక్టర్ సలహాతో పాటించడం చాలా అవసరం. క్రమం తప్పకుండా తీసుకుంటే కాకరకాయ జ్యూస్ మధుమేహాన్ని నియంత్రించడంలో మిత్రంగా మారుతుంది.