Jaggery Tea Effects: షుగర్ పేషెంట్స్ బెల్లం టీ తాగుతున్నారా? అయితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే.. ఇది తెలుసుకోండి

Bellam Tea Effects: చక్కెరతో పోల్చితే బెల్లం కాస్త ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే, చక్కర తయారీలో చాలా విధాలుగా అది ప్రాసెస్ చేయబడుతుంది.

Jaggery Tea Effects: షుగర్ పేషెంట్స్ బెల్లం టీ తాగుతున్నారా? అయితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే.. ఇది తెలుసుకోండి

Bellam tea side effects

Updated On : June 25, 2025 / 12:06 PM IST

ప్రస్తుత సమాజంలో మధుమేహంతో బాధపడుతున్నవారు చాలానే ఉన్నారు. యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. వాటిలో కొన్ని జన్యు సమందమైన కారణాలైతే మరికొన్ని మారుతున్న జీవన విధానం వల్ల ఏర్పడ్డ కారణాలు కావచ్చు. ఇక ఈ షుగర్ సమస్యతో బాధపడుతున్నవారు చక్కరకు దూరంగా ఉంటారు. కొంత మంది చక్కరకు బదులుగా బెల్లాన్ని వాడుతున్నారు. ఇది సహజ సిద్ధంగా తయారవుతుందని చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది బెల్లంతో చేసిన టీ తాగడానికి ఇషటపడుతున్నారు. కానీ, బెల్లం టీ కూడా షుగర్ ను పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు. మరి బెల్లం టీ తాగితే ఏమవుతుంది అనేది ఇప్పడు తెలుసుకుందాం.

చక్కెరతో పోల్చితే బెల్లం కాస్త ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే, చక్కర తయారీలో చాలా విధాలుగా అది ప్రాసెస్ చేయబడుతుంది. కానీ, బెల్లం చాలా సహజంగా తయారవుతుంది. దీంతో బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది అనుకుంటారు. నిజానికి బెల్లం ఆరోగ్యానికి మంచిదే. ఇది ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

కేవలం ఇదే కారణంతో షుగర్ పేషేంట్స్ కూడా బెల్లం తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. కానీ, చక్కెరలా బెల్లం ప్రాసెస్ కాకపోయినా ఇందులో కూడా చక్కర స్థాయిలు అధికంగానే ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇది కూడా రక్తంలో చక్కర స్థాయిలను పెంచుతుందట. అంతేకాదు, బెల్లంలో గ్లైకోమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి షుగర్ పేషేంట్స్ బెల్లం ను ఆప్షన్ గా తీసుకోవడం మంచిది కాదు. బెల్లం టీకి ఎంత దూరంగా ఉండే అంత మంచిది.

బెల్లం గురించి అపోహలు:

  • చాలామంది అనుకుంటున్నట్టుగా బెల్లం తక్కువ హానికరమైన చక్కెర మాత్రం కాదు. షుగర్ పేషేంట్స్ తీసుకోవడం ప్రమాదమే.
  • బెల్లంలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. ఇది త్వరగా షుగర్‌గా మారుతుంది, లెవెల్స్ ను పెంచుతుంది.
  • సహజంగా తయారవుతుంది కాబట్టి బెల్లాన్ని ఆరోగ్యంగా భావిస్తారు. కానీ ఇది డయబెటిక్ వ్యక్తులకు మంచిది కాదు.

బెల్లం టీ వద్దు షుగర్ ఫ్రీ హెర్బల్ టీ తాగండి:

  • షుగర్ ఫ్రీ హెర్బల్ టీ: దాల్చిన చెక్క, అల్లం, తులసి వంటి పదార్థాలతో తయారయ్యే టీ.
  • స్టీవియా: డయబెటిక్ పేషెంట్స్ కోసం ప్రత్యేకంగా ఉండే సహజ స్వీట్‌నర్. దీనితో టీ తాగొచ్చు.
  • గ్రీన్ టీ / బ్లాక్ టీ: చక్కెర లేకుండా తాగడం మంచిది.