Osmania Hospital : ఉస్మానియా ఆస్పత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డు.. ప్రారంభించిన కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి

ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డు ప్రారంభమైంది. కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్‌ శ్వేతా మహంతి గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డును ప్రారంభించారు. కమీషనర్‌ శ్వేతా మహంతి గురువారం( సెప్టెంబర్ 15,2022)న ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ఆమె సుమారు 2 గంటల పాటు ఆస్పత్రిలోని పలు విభాగాల్లో పూర్తిస్థాయిలో పర్యటించారు.

Osmania Hospital : ఉస్మానియా ఆస్పత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డు.. ప్రారంభించిన కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి

Osmania Hospital Gastroenterology Ward

Updated On : September 16, 2022 / 10:40 AM IST

Osmania Hospital Gastroenterology Ward : ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డు ప్రారంభమైంది. కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్‌ శ్వేతా మహంతి గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డును ప్రారంభించారు. కమీషనర్‌ శ్వేతా మహంతి గురువారం( సెప్టెంబర్ 15,2022)న ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ఆమె సుమారు 2 గంటల పాటు ఆస్పత్రిలోని పలు విభాగాల్లో పూర్తిస్థాయిలో పర్యటించారు. ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా నియమితులైన అనంతరం ఆమె తొలిసారిగా ఆస్పత్రిని సందర్శించారు. ఆమెకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.నాగేందర్‌ పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా శ్వేతా మహంతి.. ఉస్మానియా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శశికళారెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.నాగేందర్‌తో కలిసి గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డును ప్రారంభించారు. అనంతరం ఆమె వైద్యాధికారులతో కలిసి ఆయా విభాగాలలో పర్యటించారు. వైద్య నిపుణుల సంఖ్య, ఔట్‌ పేషెంట్‌, ఇన్‌ పేషెంట్‌ రోగుల సంఖ్య, ఎంత, ఒక్కరోజు ఎన్ని శస్త్రచికిత్సలు చేస్తునారనే విషయాలను డాక్టర్‌ నాగేందర్‌ను అడిగి తెలుసుకున్నారు.

Hair In Stomach : బాలిక కడుపులో 2 కిలోల వెంట్రుకలు…ప్రాణం కాపాడిన వైద్యులు

పాత భవనంతోపాటు కులీకుతుబ్‌ షా, ఓపీ భవనాల్లోని పలు వార్డుల్లోకి వెళ్లి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ త్రివేణి,ఆర్‌ఎంవో-1 డాక్టర్‌ శేషాద్రి, ఆర్‌ఎంవోలు డాక్టర్‌ సాయిశోభ, డాక్టర్‌ బి శ్రీనివాసులు, డాక్టర్‌ ఎండీ రఫీ, టీఎస్‌ఐడీసీ ఇంజినీరింగ్‌ అధికారులు శ్రీరాములు, జగదీశ్‌, ప్రసాద్‌తో పాటు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.