కరోనావైరస్ వ్యాక్సిన్‌ను ఎవరు ముందుగా అందుకోబోతున్నారు?

Coronavirus Vaccine: కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.. కరోనా మహమ్మారిని అంతం చేసే టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నాయి ప్రపంచ దేశాలు.. కరోనా వ్యాక్సిన్లు పెద్ద మొత్తంలో ట్రయల్ దశలో ఉన్నప్పటికీ ఒక్క రష్యా వ్యాక్సిన్ మాత్రమే పంపిణీ దిశగా కొనసాగుతోంది..
మూడో ట్రయల్స్ కు ముందుగానే వ్యాక్సిన్ పనితీరు అద్భుతంగా ఉందని రష్యా ప్రకటించుకుంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే తామే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ విడుదల చేశామని చెబుతోంది.. రష్యా ‘స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చింది.. ఈ వ్యాక్సిన్ పై ప్రపంచ దేశాల పరిశోధకుల వ్యతిరేకత నెలకొంది.. వ్యాక్సిన్ ఎంతవరకు సమర్థవంతంగా పనిచేయగలదోనని అనుమానం వ్యక్తం చేశారు. సాధారణంగా ఏదైనా ఒక వ్యాక్సిన్ అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురావాలంటే చాలా సమయం పడుతుంది.
అలాంటి అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్ వేగంగా తీసుకురావడం సరైనది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రపంచ సంక్షోభంలో వ్యాక్సిన్ రేసులో ఎవరు ముందుగా కరోనా టీకాను తీసుకోస్తారు.. ఎంత ఖర్చవుతుందనేది ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అంటు వ్యాధులతో పోరాడటానికి వ్యాక్సిన్లు పరీక్షించడానికి పంపిణీ చేయడానికి ఏళ్ల సమయం పడుతుంది.
వ్యాక్సిన్ త్వరగా వస్తుందా? :
కరోనావైరస్ నుంచి ఏ వ్యాక్సిన్ సమర్థవంతగా పనిచేయగలదో వేలాది మంది పాల్గొన్న ట్రయల్స్ ద్వారా గుర్తించే పనిలో పడ్డారు పరిశోధకులు.. పరిశోధన నుండి డెలివరీ వరకు సాధారణంగా ఐదు నుండి 10 ఏళ్లు పట్టే ప్రక్రియ నెలల తరబడి సాగుతుంది. పెట్టుబడిదారులు, తయారీదారులు సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉండటానికి బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ట్రయల్స్ లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని చెబుతోంది..
అక్టోబర్ నాటికి భారీగా టీకాలు వేయడం ప్రారంభిస్తామని అంటోంది. మరోవైపు చైనా కూడా తమ కరోనా వ్యాక్సిన్ ముందుగా చైనా సైనిక సిబ్బందికి అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించింది. టీకాను ఈ ఏడాది చివరినాటికి ఆమోదించాలని భావిస్తున్నాయి.. 2021 మధ్యకాలం వరకు కోవిడ్ వ్యాక్సిన్లను విస్తృతంగా విడుదల చేయాలని WHO ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్.. బ్రిటిష్ ఔషధ తయారీదారు అస్ట్రాజెనెకా, ప్రపంచ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతోంది. UKకి మాత్రమే 100 మిలియన్ మోతాదులను సరఫరా చేయడానికి అంగీకరించింది. ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్లు సరఫరా చేయనుంది. 2020 చివరి నాటికి 100 మిలియన్ మోతాదుల వరకు 2021 చివరి నాటికి 1.3 బిలియన్ మోతాదుల కంటే ఎక్కువ మోతాదులో ఉండవచ్చు.
క్లినికల్ ట్రయల్స్‌లో దాదాపు 20 ఇతర ఔషధ కంపెనీలు ఉన్నాయి. సాధారణంగా టీకా పరీక్షల్లో 10% మాత్రమే విజయవంతం అవుతాయి. కానీ ఈ వ్యాక్సిన్లలో ఒకటి విజయవంతం అయినా వెంటనే అందుబాటులోకి వచ్చే పరిస్థితుల్లేవు. ఇప్పటివరకు కనీసం 80 ధనిక దేశాలు, ఆర్థిక వ్యవస్థలు కోవాక్స్ ప్రపంచ వ్యాక్సిన్ ప్లాన్‌కు సంతకం చేశాయి. 2020 చివరినాటికి (£ 1.52 బిలియన్ డాలర్లు)కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎంత ఖర్చు అవుతుంది? :
వ్యాక్సిన్ అభివృద్ధికి బిలియన్ డాలర్లు పెట్టుబడుతున్నాయి.. టీకా కొనుగోలు, సరఫరా చేస్తామని మిలియన్ల మందికి హామీ ఇస్తున్నారు. మోతాదును బట్టి టీకా ధరలు, టీకా రకం, తయారీదారు, ఆర్డర్ల మోతాదుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. ఫార్మాస్యూటికల్ కంపెనీ మోడెర్నా, వ్యాక్సిన్‌కు ఒక మోతాదుకు 32 డాలర్ల నుంచి 37 డాలర్ల మధ్య (24 పౌండ్లు నుండి 28 పౌండ్లు) అమ్ముతున్నట్లు సమాచారం.. మరోవైపు, అస్ట్రాజెనెకా తన వ్యాక్సిన్‌ను మోతాదుకు కొన్ని డాలర్లతో సరఫరా చేస్తామని తెలిపింది.
ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ssi)గవి, బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి 150 మిలియన్లతో భారతదేశానికి కరోనా-19 వ్యాక్సిన్లను 100 మిలియన్ మోతాదు పంపిణీ చేయనుంది. సీలింగ్ ధర మోతాదుకు 3 ( 2.28 పౌండ్లు) డాలర్లు ఉంటుందని అంటున్నారు.
https://10tv.in/covid-19-patients-can-vote-in-bypolls/
కానీ టీకా తీసుకున్న రోగుల నుంచి ఛార్జీలు వసూలు చేసే అవకాశం లేదు. ఆస్ట్రేలియా లాంటి ఇతర దేశాలు తమ జనాభాకు ఉచిత మోతాదులను అందిస్తామని హామీ ఇస్తున్నాయి.. యుఎస్‌లో, షాట్ ఉచితం అయినప్పటికీ, ఆరోగ్య సంరక్షణ నిపుణులు జబ్ నిర్వహణ కోసం వసూలు చేయవచ్చు – బీమా చేయని అమెరికన్లను టీకా బిల్లును ఎదుర్కొనే
అవకాశం ఉంది.
మొదట ఎవరికంటే? :
ఔషధ కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేస్తున్నప్పటికీ, మొదట ఎవరు టీకాలు వేయాలో నిర్ణయించే అధికారం ఉండదు.. ప్రతి సంస్థ లేదా దేశం మొదట ఎవరికి రోగనిరోధక శక్తిని ఇస్తుందో అది ఎలా చేస్తుందో నిర్ణయించాల్సి ఉంటుందని ఆస్ట్రాజెనెకా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చెప్పారు. ప్రారంభంలో సరఫరా పరిమితంగా ఉండటంతో మరణాలను తగ్గించడం కష్టమంటోంది ఆరోగ్య సంస్థ..