Anti Aging Foods : యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తో వృద్ధాప్యం ఆలస్యం!

అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే అహారాలను దూరంగా పెట్టటం మంచిది. ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడానికి చక్కెరలు, స్వీట్ ఫుడ్స్, కాఫీ, ఇతర పానీయాలను నివారించాలి.

Anti Aging Foods : యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తో వృద్ధాప్యం ఆలస్యం!

anti-aging foods

Updated On : August 27, 2022 / 9:13 AM IST

Anti Aging Foods : వయస్సు పెరిగే కొద్దీ శరీరం బలహీనంగా మారుతుంది. చురుకుదనం తగ్గుతుంది. మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, బోలు ఎముకల వ్యాధి వంటి వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వృద్ధాప్యం అనేది తప్పనిసరి ప్రక్రియ, దీనివల్ల అంతర్గత అవయవాలు మాత్రమే కాకుండా చర్మంపై ముడతలు, గీతల రూపంలో ప్రభావితం చేస్తుంది.

వృద్ధాప్యాన్ని ఆపలేనప్పటికీ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, చురుకుగా ఉండటం, సరైన చర్మ సంరక్షణను అనుసరించడం, జీవనశైలి ఎంపికలను అనుసరించడం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేయవచ్చు. వయస్సు సంబంధిత వ్యాధుల పురోగతిని మందగించడానికి అనేక ఆహారాలు ప్రయోజనకరమైనవిగా ఉంటాయి. వెల్లుల్లి, బ్లూబెర్రీస్, అవకాడోలు, బ్రోకలీ వంటి కూరగాయలు శరీరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ,డిటాక్సిఫికేషన్ కు తోడ్పడతాయి.

పండ్లు, కూరగాయలు, కొవ్వు చేపలు వంటి మంచి నాణ్యత గల లీన్ ప్రొటీన్‌లతో కూడిన ఆహారం అనేక ప్రయోజనాలను అందిస్తుంది, ఇవి ఎముక మరియు హృదయనాళ ఆరోగ్యానికి తోడ్పడతాయి. శరీర కండర ద్రవ్యరాశిని నిర్వహించటానికి ఉపయోగపడుతాయి. అకాల చర్మ వృద్ధాప్యంతో పోరాడటానికి సహాయపడే ఆహారం విషయానికి వస్తే పండ్లు మరియు కూరగాయలు, ముఖ్యంగా బొప్పాయి, బ్రోకలీ మరియు స్ట్రాబెర్రీ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారంతో శరీర పోషక అవసరాలన్నింటినీ తీర్చడంలో సహాయకారిగా ఉపయోగపడతాయి.

అదేసమయంలో అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే అహారాలను దూరంగా పెట్టటం మంచిది. ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడానికి చక్కెరలు, స్వీట్ ఫుడ్స్, కాఫీ, ఇతర పానీయాలను నివారించాలి. ప్రాసెసింగ్ ఫుడ్స్ జోలికి వెళ్ళకుండా ఉండటం మంచిది. సంతృప్త కొవ్వు అధికంగా ఉన్న ఆహారాలైన వెన్నతోకూడిన పాలు, అధిక కొవ్వు మాంసం వంటి వాటిని కూడా పరిమితం చేయాలి, వీటిలో గొడ్డు మాంసం, పంది మాంసం ఉత్పత్తుల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది.