Pistachio For Blood Sugar : పిస్తాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయా ? వాటిని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే..

అనేక శతాబ్దాల క్రితం నుండి పిస్తాపప్పు ప్రజలు తినేందుకు ఇష్టపడుతున్నారు. వీటిలో అనేక ఔషధ ప్రయోజనాలు ఉండటం వల్ల మన పూర్వికులు సైతం ఉపయోగించారు. మలబద్ధకం జీర్ణ సమస్యల చికిత్సకు అనేక దేశాలలో వేల సంవత్సరాల క్రితం నుండి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

Pistachio For Blood Sugar : పిస్తాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయా ? వాటిని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే..

Pistachio For Blood Sugar

Pistachio For Blood Sugar : డయాబెటిస్‌తో బాధపడుతున్న చాలా మంది ఆరోగ్యకరమైన అల్పాహారాలను తీసుకోవటానికి ఇష్టపడతారు. ఇవి కడుపును నిండుగా ఉంచటంతోపాటు, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. టీ తీసుకునే సమయంలో రుచికరమైన ,పోషక విలువలు కలిగిన పిస్తాపప్పులను తీసుకోవచ్చు. పిస్తాపప్పులు కరకరలాడుతూ, వగరుగా , కొద్దిగా తీపిగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి సరైన చిరుతిండిగా నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ముహూర్తం ఖరారు

పిస్తా గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు ,విటమిన్లు కలిగి ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవాలనుకునే వారు ఈ ఆరోగ్యకరమైన గింజలను ఆహారంలో చేర్చుకోవచ్చు. పిస్తాపప్పును వంటకాలలో రుచి కోసం ఉపయోగించవచ్చు.

పిస్తాపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ B6 మరియు థయామిన్‌తో సహా వివిధ పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. అవి బరువు తగ్గించేందుకు దోహదం చేస్తాయి. కొలెస్ట్రాల్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. గట్, కంటి , రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

READ ALSO : BJP: ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?

అనేక శతాబ్దాల క్రితం నుండి పిస్తాపప్పు ప్రజలు తినేందుకు ఇష్టపడుతున్నారు. వీటిలో అనేక ఔషధ ప్రయోజనాలు ఉండటం వల్ల మన పూర్వికులు సైతం ఉపయోగించారు. మలబద్ధకం జీర్ణ సమస్యల చికిత్సకు అనేక దేశాలలో వేల సంవత్సరాల క్రితం నుండి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో, పిస్తాపప్పులు శరీరం, మనస్సుకు ,మెదడు పనితీరును మెరుగుపరచడానికి ,మొత్తం శరీర శక్తికి సహాయపడతాయి.

రక్తంలో చక్కెర అదులో ఉంచటంలో పిస్తాపప్పు

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచటానికి పిస్తాపప్పులు మంచిదనే విషయం చాలా మందికి తెలియదు. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే , మధుమేహాన్ని నియంత్రించుకోవాలనుకుంటే ఆహారంలో పిస్తాలను చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. షుగర్ లెవల్స్‌ను నియంత్రించే విషయంలో పిస్తాలు అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

READ ALSO : Flying Car : ఎగిరే కారు.. రోడ్డుపై, గాల్లోనూ దూసుకుపోగలదు

ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నందున రక్తంలో చక్కెర వేగంగా పెరగడానికి కారణం కాదు. ఇతర స్నాక్స్‌తో పోలిస్తే, పిస్తాలో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. రోజంతా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్ధిరంగా ఉండటానికి అద్భుతమైన ఎంపికగా చేప్పవచ్చు. పిస్తాపప్పులో ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి మంచి ఎంపికగా చేప్పవచ్చు.