Flying Car : ఎగిరే కారు.. రోడ్డుపై, గాల్లోనూ దూసుకుపోగలదు

గాలిలో అయితే 110 మైళ్ల వరకు ఎగరగలదు. ఈ కారులో నుంచి 180 డిగ్రీల కోణంలో చూసే వెసులుబాటు ఉంది.

Flying Car : ఎగిరే కారు.. రోడ్డుపై, గాల్లోనూ దూసుకుపోగలదు

USA developed flying car

USA Developed  Flying Car : నగరాల్లో ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నారా? గాల్లో ఎగురుకుంటూ గమ్యస్థానానికి చేరుకోవాలనుకుంటున్నారా? అయితే గాలిలో ఎగరాలనే కల త్వరలో నిజం కాబోతుంది. ఎగిరే కారు మార్కెట్ లోకి రాబోతుంది. రోడ్డుపై దూసుకుపోతూ ట్రాఫిక్ అధికంగా ఉన్న చోట పక్షిలా గాల్లో ఎగిరిపోయే కారు అందుబాటులోకి రానుంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ ఈ తరహా కారును అభివృద్ధి చేసింది.

తాజాగా డెట్రాయిట్ లో నిర్వహించిన ఆటో షోలో గాలిలో ఎగిరే కారును ప్రదర్శించారు. ఈ ఏడాది జూన్ లో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ కారుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ కారులో ఇద్దరు ప్రయాణించవచ్చు. దీని ధర సుమారు రూ.2.46 కోట్లు. విద్యుత్ శక్తితో నడిచే ఈ కారు రోడ్డుపై 200 మైళ్ల వరకు ప్రయాణించగలదు.

solar airship : ఇంధనం అవసరం లేని సోలార్ ఎయిర్ షిప్.. గంటకు 83 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం

గాలిలో అయితే 110 మైళ్ల వరకు ఎగరగలదు. ఈ కారులో నుంచి 180 డిగ్రీల కోణంలో చూసే వెసులుబాటు ఉంది. అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ 2022లోనే ఈ కార్లను ముందస్తు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఇప్పటివరకు 500 వరకు బుక్ అయ్యాయి.