Toilet Time: టాయిలెట్‌లో అధిక సమయం కూర్చుంటున్నారా? ఈ అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయ్‌..

ఎక్కువసేపు కూర్చోవడం ఒత్తిడిని పెంచి, సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని వైద్యులు వివరించారు.

Toilet Time: టాయిలెట్‌లో అధిక సమయం కూర్చుంటున్నారా? ఈ అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయ్‌..

Updated On : November 13, 2024 / 6:30 PM IST

మలవిసర్జనకు వెళ్లేటప్పుడు ఫోన్ పట్టుకెళ్తారు చాలా మంది.. న్యూస్ పేపర్‌ పట్టుకెళ్తారు మరి కొందరు. ఫోన్‌ చూస్తూనో, పేపర్‌ చదువుతూనో టాయిలెట్‌లోనే నిమిషాల కొద్దీ కూర్చుంటారు. అలా చేస్తే ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 10 నిమిషాల కంటే అధిక సమయం టాయిలెట్‌లో కూర్చుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

టాయిలెట్‌లో ప్రతిరోజు 10 నిమిషాల కంటే అధిక సమయం కూర్చుండిపోతే హెమరాయిడ్స్‌ (పైల్స్‌), కటి సంబంధ బలహీనత వంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది బాత్రూంలలోకి ఫోన్లు తీసుకెళ్లి దాదాపు 15 నిమిషాల పాటు ఫోన్లను స్క్రోల్ చేస్తూ చూస్తున్నారని వైద్యులు అంటున్నారు.

హెమరాయిడ్స్‌, కటి సంబంధ బలహీనత వంటి ఆరోగ్య సమస్యలతో చాలా మంది రోగులు తమ వద్దకు వస్తున్నారని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్‌వెస్ట్రన్ మెడికల్ సెంటర్‌ కొలొరెక్టల్ సర్జన్ డాక్టర్ లై జుయే చెప్పారు. టాయిలెట్‌పై కూర్చునే పొజిజన్ శరీరానికి ప్రతికూల ఫలితాలను ఇస్తుందని తెలిపారు.

గురుత్వాకర్షణ శక్తి భూమిపై మనం ఉండడానికే కాకుండా, హృదయానికి రక్తప్రసరణ జరగడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. టాయిలెట్ ఓవల్ ఆకారపు సీటు మలాశయాన్ని సాధారణ కుర్చీలో కంటే తక్కువ స్థానంలో ఉంచుతుందని వివరించారు. దీంతో గురుత్వాకర్షణ శక్తి కటిపై ఒత్తిడిని తీసుకొస్తుందని అన్నారు.

దీంతో మలాశయములో సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. పేగులో కొంత భాగం జారిపోతుందని చెప్పారు. దీంతో అక్కడి కవాటం మీదుగా రక్త ప్రసరణ జరిగి, మళ్లీ వెనక్కు వెళ్లే అవకాశం ఉండని స్థితి ఏర్పడుతుందని అన్నారు. దీంతో అక్కడి రక్త నాళాలు ఉబ్బి, హెమరాయిడ్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని చెప్పారు.

టాయిలెట్‌ సీట్లో ఎక్కువసేపు కూర్చోవడం ఒత్తిడిని పెంచి, సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని వివరించారు. మలవిసర్జన సమయంలో ప్రేగు కదలికల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు 10 నిమిషాల కంటే అధిక సమయం బాత్రూంలో ఉండకూడదని మరికొందరు వైద్యులు కూడా చెప్పారు.

Viral Video: జిప్‌లైన్‌లో రాహుల్ గాంధీ.. ఎందుకు ఇలా చేశారో తెలుసా?