Viral Video: జిప్‌లైన్‌లో రాహుల్ గాంధీ.. ఎందుకు ఇలా చేశారో తెలుసా?

వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో తన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తరఫున ప్రచారం చేయడానికి అదే ప్రాంతంలో రాహుల్ గాంధీ ఉన్నారు.

Viral Video: జిప్‌లైన్‌లో రాహుల్ గాంధీ.. ఎందుకు ఇలా చేశారో తెలుసా?

Updated On : November 13, 2024 / 4:52 PM IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌లో జిప్‌లైన్‌లో పయనించారు. రాహుల్ గాంధీ యూట్యూబ్‌ చానెల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేరళలోని వయనాడ్‌లో కొన్ని నెలల క్రితం కొండ చరియలు విరిగిపడి తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిన విషయం తెలిసిందే.

వయనాడ్‌లో తిరిగి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి రాహుల్‌ ఇలా జిప్‌లైన్‌లో పయనిస్తూ అక్కడి ప్రకృతి అందాలను చూశారు. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో తన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తరఫున ప్రచారం చేయడానికి అదే ప్రాంతంలో రాహుల్ గాంధీ ఉన్నారు.

ఈ సందర్భంగానే ఆయన కరపుజా డ్యామ్ సైట్ వద్ద ఉన్న జిప్‌లైన్‌ను సందర్శించారు. వీడియో రూపంలో రాహుల్ గాంధీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిన్న వయనాడ్‌లో ప్రియాంక తరఫున ప్రచారంలో పాల్గొన్నానని అన్నారు. కొంతమంది స్థానికులతో మాట్లాడే అవకాశం దక్కిందని తెలిపారు.

భారీ స్వింగ్, డ్రాప్ టవర్, థ్రిల్లింగ్ జిప్‌లైన్ ఇక్కడ ఉన్నాయని, వయనాడ్ ఎప్పటిలాగే అద్భుతంగా ఉందని, ఈ పర్యాటక ప్రాంతం సురక్షితమైందని సందర్శకులకు చూపించడానికే తాను జిప్‌లైన్‌లో పయనించానని తెలిపారు. ఇక్కడ గడిపిన ప్రతి సెకనూ ఎంజాయ్ చేశానని చెప్పారు.

Viral Video: ప్రతిరోజూ 40,000 పానీపూరీలను తయారుచేస్తున్న 14 ఏళ్ల బాలుడు.. మిషన్‌ కంటే వేగంగా తయారీ