Viral Video: ప్రతిరోజూ 40,000 పానీపూరీలను తయారుచేస్తున్న 14 ఏళ్ల బాలుడు.. మిషన్ కంటే వేగంగా తయారీ
ఇప్పుడు ఆ బాలుడి వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఎంతో క్రిప్సీగా, స్పైసీగా ఉండే పానీ పూరీ అంటే చాలా మంది ఇష్టం. లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. రోడ్డు పక్కన అమ్మే పానీపూరీ తింటే ఆరోగ్యానికి చేటని తెలిసినా చాలా మంది అవేవీ పట్టించుకోకుండా తింటుంటారు.
పానీ పూరీ తయారు చేసేవారు కొందరు ఎంతో స్కిల్‌తో వాటిని తయారు చేస్తుంటారు. ఇంటర్నెట్‌లో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అటువంటి ఓ వీడియోనే ఇది. 14 ఏళ్ల ఓ బాలుడు పానీ పూరీని మిషన్ కంటే వేగంగా తయారు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ బాలుడి వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఫుడీ ఇంకర్నేట్ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో ఆ బాలుడి వీడియోను షేర్ చేశారు. గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక వీధి పక్కన ఉన్న ఫుడ్ స్టాల్‌లో ఓ బాలుడు మెరుపు వేగంతో గోల్‌గాప్పే(పూరీ)ను తయారు చేస్తున్నాడు.
ఆ బాలుడు 6 సంవత్సరాల వయస్సు నుంచరి వీటిని తయారు చేస్తున్నాడు. మిషన్ కంటే వేగంగా వాటిని చేసే నైపుణ్యాన్ని సంపాదించాడు. ఆ బాలుడు ప్రతిరోజూ దాదాపు 40,000 పూరీలను తయారు చేస్తాడు.
View this post on Instagram
వావ్.. అంగారక గ్రహంపై ఇంటర్నెట్.. స్పేస్‌ఎక్స్ ‘మార్స్‌లింక్’ ప్రతిపాదన గురించి తెలుసా?