Sleeping Problems: నిద్రలో నోరు ఎండిపోతుందా.. అయితే ఆ సమస్య ఉన్నట్టే.. జాగ్రత్తగా ఉండండి

గొంతు ఎండిపోవడం అనేది చాలా సాధారమైన సమస్య. కానీ, ఇది నిద్రలో ఉన్నప్పుడు జరగడం అనేది చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.

Sleeping Problems: నిద్రలో నోరు ఎండిపోతుందా.. అయితే ఆ సమస్య ఉన్నట్టే.. జాగ్రత్తగా ఉండండి

Sleeping problems cause diabetic

Updated On : June 27, 2025 / 1:55 PM IST

ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, నిద్రలో వచ్చే కొన్ని సమస్యలు కూడా శరీరంలోని మరిన్ని సమస్యలకు సంకేతాలు కావచ్చు అని నిపుణులు చెప్తున్నారు. ఆ సంకేతాలతో ముఖ్యమైనది నోరు ఎండిపోవడం, గొంతు తడారిపోవడం. నిజానికి గొంతు ఎండిపోవడం అనేది చాలా సాధారమైన సమస్య. కానీ, ఇది నిద్రలో ఉన్నప్పుడు జరగడం అనేది చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఇది మనకు రాబోతున్న మరికొన్ని ప్రమాదకరమైన సమస్యలకు కారణం కావచ్చట. మరి ఆ సమస్యలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది ఏ వ్యాధుల లక్షణం కావచ్చు?

ఢిల్లీ RML హాస్పిటల్‌ మెడిసిన్ విభాగం యూనిట్ హెడ్ డాక్టర్ సుభాష్ గిరి ఈ సమస్య గురించి, అలా జరగడం ఏ వ్యాధికి సంకేతం అనే విషయం వివరణ ఇచ్చారు.

డయాబెటిస్: సాధారణంగా డయాబెటిస్ సమస్య ఉన్నవారికి చాలా దాహం వేస్తుంది. కాబట్టి, నిద్రలో అధికంగా దాహం వేయడం, నోరు ఎండిపోవడం వంటివి జరగడం అనేది డయాబెటిస్ ప్రారంభ లక్షణంగా చెప్పుకోవచ్చు.

నాసికా లేదా అలెర్జీ సమస్యలు: సైనస్, ముక్కు మూసుకుపోవడం, టాన్సిల్స్ ఇంకా ఏదైనా అలెర్జీల కారణంగా నిద్రపోతున్నప్పుడు నోరు తెరిచి ఉంచడం చాలా మంది చేస్తారు. ఆ కారణం వల్ల కూడా నోరు ఎండిపోవడం జరుగుతుంది.

డీహైడ్రేషన్: ఇది లాలజల గ్రంధులను ప్రభావితం చేస్తుంది కాబట్టి శరీరంలో నీటి శాతం తగ్గిపోయి నోరు పొడిబారడం సమస్య తలెత్తవచ్చు. ఇది డీహైడ్రేషన్ కు కారణం కావచ్చు.

స్లీప్ అప్నియా: నిద్రలో శ్వాస తీసుకోవడం సాధారణ విషయమే కానీ, స్లీప్ అప్నియాలో సమస్య వల్ల అది కాస్త ఎక్కువగా ఉండొచ్చు. దాని వల్ల నోరు పొడిబారే సమస్యకు కారణమవుతుంది.

జోగ్రెన్స్ సిండ్రోమ్: ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది లాలాజలం, రోగనిరోధక వ్యవస్థ, కన్నీళ్లను ఉత్పత్తి చేసే గ్రంథులపై దాడి చేస్తుంది. ఆ కారణంగా నోరు, కళ్లు పొడిబారిపోతాయి.

లక్షణాలు ఇవే:

  • నోరు, గొంతు, పెదవులు ఎండిపోవడం. పగుళ్లు రావడం.
  • ఎక్కువగా దాహం వేయడం.
  • మాట్లాడటం, మింగడంలో కష్టం
  • నోటిలో పుండ్లు లేదా బొబ్బలు
  • లాలాజలం గట్టిపడటం
  • నోటిలో జిగట లేదా దుర్వాసన
  • నిద్రలో మేల్కొనడం.

ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి:

  • శరీరంలో నీటి కొరత రాకుండా చూసుకోవాలి. తగినంత నీరు త్రాగాలి.
  • ఆల్కహాల్, పొగాకు, కెఫిన్ లాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.