Itchy Eyes: తరుచూ కళ్ళు ఎర్రగా మారి, దురద పెడుతున్నాయా? ఈ సమస్య కారణం అవ్వొచ్చు.. జాగ్రత్తగా ఉండండి.

Itchy Eyes: కళ్ళు ఎర్రబడటానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి గాలి కాలుష్యం, పుప్పొడి ధూళి, మొదలైనవి కళ్ల అలర్జీకి కారణమవుతాయి

Itchy Eyes: తరుచూ కళ్ళు ఎర్రగా మారి, దురద పెడుతున్నాయా? ఈ సమస్య కారణం అవ్వొచ్చు.. జాగ్రత్తగా ఉండండి.

Cause of itchy eyes

Updated On : July 2, 2025 / 10:25 AM IST

కళ్ల ఆరోగ్యం అనేది మానవ జీవితంలో చాలా ప్రధానమైనది. కానీ, ప్రస్తుతం ఉన్న వాతావరం కళ్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. దానివల్ల చాలా మంది కళ్ళ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానమైనది చాలా మందిలో కనిపించేది తరుచూ కళ్ల ఎర్రబడటం, దురద పెట్టడం. ఇది సాధారణంగా కనిపించవచ్చు కానీ, కొన్ని సార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారవచ్చు. కాబట్టి, కళ్ళలో కనిపించే ఈ సమస్య ఎందుకు వస్తుంది? దాని నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తరుచూ కళ్ళు ఎర్రగా మారి దురద రావడానికి కారణాలు:

1.అలర్జీలు:
కళ్ళు ఎర్రబడటానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి గాలి కాలుష్యం, పుప్పొడి ధూళి, పెంపుడు జంతువుల రోమాలు, మనం వాడే సబ్బులు, మేకప్ ఉత్పత్తులు మొదలైనవి కళ్ల అలర్జీకి కారణమవుతాయి. దీనివల్ల శరీరం హిస్టామైన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది కళ్ల ఎర్రదనానికి, దురదకి కారణం అవుతుంది.

2. డ్రై ఐ సిండ్రోమ్:
కళ్లలో తేమ తగ్గిపోవడం వల్ల అవి పొడిబారినట్లుగా మారుతాయి. దానివల్ల కూడా కళ్ళు ఎర్రగా మారి దురద వస్తుంది. ఎక్కువగా కంప్యూటర్/మొబైల్ వాడకం, వాతావరణ మార్పులు, వయస్సులో వచ్చే మార్పులు కూడా దీనికి కారణం కావచ్చు.

3. ఇన్‌ఫెక్షన్లు:
కంజంక్టివైటిస్, పింక్ ఐ అనేది కొన్నిరకాల బాక్టీరియా, వైరస్ వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్. ఇది కంట్లో దురద, ఎర్రదనం, నీళ్ళు కారడం వంటి లక్షణాలతో కనిపిస్తుంది. ఈ సమస్య ఒకరి నుంచి మరొకటి అంటుకునే అవకాశం ఉంది. దీన్నే కళ్ళ కరక అని కూడా పిలుస్తారు.

4. కాంటాక్ట్ లెన్సుల వాడకం:
ఈ మధ్య కాలంలో చాలా మంది కళ్లజోడుకి బదులుగా కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారు. వీటిని ఎక్కువసేపు వాడడం వల్ల కూడా కళ్ళు ఎర్రబడి, దురద వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, లెన్స్ ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచకపోవడం వల్ల కళ్లలో ఫంగల్/బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు.

5. కంప్యూటర్, లాప్ టాప్ వాడకం:
కంప్యూటర్, లాప్ టాప్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కళ్ల పై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కళ్ళు బలహీనపడి ఎర్రదనం, దురద, పొడితనానికి దారితీస్తుంది.

దీని వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు:

దృష్టి మందగించడం: ఇన్ఫెక్షన్లు లేదా పొడిబారిన కళ్ల వలన స్పష్టత తగ్గుతుంది. చూపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

కళ్ల పీల్చడం వల్ల కర్నియా డ్యామేజ్: దురద కారణంగా కళ్లను గట్టిగా రుద్దడం వల్ల కంటి మీద ఉన్న కర్నియా దెబ్బతినే ప్రమాదం ఉంది.

నివారణ మార్గాలు:

కళ్ళను శుభ్రం చేసుకోవడం: రోజూ ముఖం, కళ్ల చుట్టుపక్కల శుభ్రం చేసుకోవాలి. కళ్లను చేతులతో తాకే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి.

అలర్జీలను గుర్తించడం: కళ్ళకు అలర్జీని కలిగించే వస్తువుల నుండి దూరంగా ఉండడం.

కంటి బిందువులు: డ్రై ఐ సమస్య ఉంటే కంటికి తేమనిచ్చే ఆర్టిఫిషియల్ టియర్స్ వాడొచ్చు.

స్క్రీన్ టైమ్ నియంత్రణ: ప్రతి 20 నిమిషాలకి 20 సెకన్ల పాటు దృష్టిని 20 అడుగుల దూరం ఉన్న వస్తువు మీద పెట్టడం మంచిది. బ్లూ లైట్ ఫిల్టర్ గ్లాసెస్ వాడడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

తరచూ కళ్లలో ఎర్రదనం, దురద వంటివి చిన్న సమస్యలుగా అనిపించినా, ఇవి ముఖ్యమైన ఆరోగ్య సంకేతాలుగా మారే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు కొనసాగుతుంటే అలసత్వం వహించకుండా వైద్యులను సంప్రదించాలి.