‘కరోనా’ వ్యాక్సీన్ రెడీ.. 90 రోజుల్లో మార్కెట్లోకి.. ఇదో నోటి టీకా..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (COVID-19) నివారించేందుకు తొలి వ్యాక్సీన్ కనిపెట్టారు ఇజ్రాయెల్ సైంటిస్టులు.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఆఫిర్ అక్నీస్ ప్రకారం.. అన్ని అనుకున్నట్టుగా జరిగితే కొన్నిరోజుల్లో కరోనా వైరస్ వ్యాక్సీన్ రెడీ అవుతుందని అన్నారు. అంతేకాదు.. 90 రోజుల్లో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని ఒక ప్రకటనలో వెల్లడించారు.
MIGAL (ది గెలిలీ రీసెర్చ్ ఇన్సిస్ట్యూట్)కు ధన్యవాదాలు చెబుతున్నట్టు అక్నీస్ తెలిపారు. కొవిడ్-19 మహహ్మారిని ప్రపంచవ్యాప్తంగా తరిమికొట్టగలమనే విశ్వాసం ఉందని, కరోనా వ్యాక్సీన్ డెవలప్ చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని ఆయన అన్నారు. గత నాలుగేళ్లుగా MIGAL సైంటిస్టులు ఇన్ఫెక్షియస్ బ్రోన్కైటిస్ వైరస్ (IBV)ను నిర్మూలించేందుకు ఈ వ్యాక్సీన్ రూపొందిస్తున్నట్టు చెప్పారు. సాధారణంగా ఈ వైరస్ పౌల్ట్రీలో కోళ్లపై ‘బ్రోన్కైటిస్ అనే వ్యాధి సోకేలా చేస్తుంది.
ప్రీ-క్లినికల్ ట్రయల్స్ బిగిన్ :
ఈ వైరస్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో నిర్ధారించేందుకు ముందుగా వెటర్నరీ ఇన్సిస్ట్యూట్లలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గెలిలీలో MIGAL పరిశోధక కేంద్రం ఉంది. ఇలాంటి వైరస్ రకం లేదా వ్యాధుల నివారణ కోసం ప్రత్యేకించి వ్యాక్సీన్ కోసం కాదని, టెక్నాలజీ కోసం రూపొందించాలనే కాన్సెప్ట్ మాత్రమేనని శాస్త్రవేత్తల బృందం ముఖ్యులైన చెన్ కాట్జ్ తెలిపారు.
కొత్త ప్రొటీన్ ఆధారంగా ఈ వ్యాక్సీన్ సైంటిఫిక్ ప్రేమ్ వర్క్ రూపొందిస్తున్నట్టు చెప్పారు. శరీరంలోకి ప్రవేశించిన వైరస్ తాలుకూ కణాలకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ నుంచి వైరల్ యాంటీజన్ ప్రొటీన్ పంపుతుంది. ఎండోసైటాసిస్ అనే ప్రక్రియ ద్వారా దీన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రీ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ పరిశోధకుల బృందం నోటీద్వారా వ్యాక్సీనేషన్ ఇస్తారు. ప్రత్యేకమైన యాంటీ IBV యాంటీ బాడీస్ ను అత్యధిక స్థాయిలో ప్రేరేపిస్తుందని బృందం నిరూపించిందని కాట్జ్ చెప్పారు.
కొన్నివారాల్లో కరోనా టీకా సిద్ధం :
ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తికి కారణమయ్యే కరోనావైరస్ DNAను శాస్త్రవేత్తలు క్రమం చేసిన తరువాత, MIGAL పరిశోధకులు దీనిని పరిశీలించారు. తద్వారా పౌల్ట్రీ కరోనావైరస్ మానవునికి అధిక జన్యు సారూప్యతను కలిగి ఉందని కనుగొన్నారు. ఇది అదే సంక్రమణ విధానాన్ని ఉపయోగిస్తుందని తెలిపారు. చాలా తక్కువ వ్యవధిలో సమర్థవంతమైన మానవ వ్యాక్సిన్ సాధించడమే లక్ష్యంగా కాట్జ్ చెప్పారు.
ఈ ప్రక్రియ మధ్యలో ఉందని, కొన్ని వారాల్లో తమ చేతిలో వ్యాక్సిన్ వస్తుందని తెలిపారు. కరోనా వైరస్‌ను నివారించే టీకా తమ దగ్గర ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి MIGAL బాధ్యత వహిస్తుంది. అయితే అప్పుడు క్లినికల్ ట్రయల్స్ పెద్ద ఎత్తున ఉత్పత్తితో సహా ఒక నియంత్రణ ప్రక్రియ ద్వారా వెళ్లాల్సి ఉంటుందని కాట్జ్ చెప్పారు.
90 రోజుల్లోగా మార్కెట్లోకి వ్యాక్సీన్ :
ఈ వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా మార్కెట్‌కు తీసుకురావాలనే లక్ష్యంతో అన్ని ఆమోద ప్రక్రియలను వేగంగా ట్రాక్ చేయాలని తమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్‌కు సూచించినట్లు అక్నీస్ చెప్పారు. మానవ కరోనావైరస్ వ్యాక్సిన్ అత్యవసర ప్రపంచ అవసరాన్ని బట్టి, అభివృద్ధిని వేగవంతం చేయడానికి తాము చేయగలిగినదంతా చేస్తున్నామని MIGAL సీఈఓ డేవిడ్ జిగ్డాన్ చెప్పారు.
టీకాను 90 రోజుల్లో భద్రతా ఆమోదం సాధించగలదని ఆయన తెలిపారు. ఇది నోటి వ్యాక్సిన్ అవుతుంది. సాధారణ ప్రజలకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని జిగ్డాన్ చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాక్సీన్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు అవసరమైన భాగస్వాములతో తీవ్రమైన చర్చలు జరుపుతున్నామని చెప్పుకొచ్చారు.
Also Read | కరోనా ఎఫెక్ట్ : పతనమైన సెన్సెక్స్… నిమిషాల్లో 5 లక్షల కోట్ల నష్టం