Garlic : జుట్టు రాలే సమస్యను తగ్గించి కుదుళ్లను దృఢంగా మార్చే వెల్లుల్లి!
జుట్టు రాలే సమస్యను కంట్రోల్ చేసుకోవడానికి వెల్లుల్లి బాగా తోడ్పడుతుంది. వెల్లుల్లిలో అధిక పరిమాణంలో పోషకాలు ఉండడం వల్ల జుట్టుకు కావాల్సిన పోషన్ను అందజేసి జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పొడువుగా పెరిగేలా సహాయపడతాయి.

garlic
Garlic : ప్రస్తుత కాలంలో చాలామంది జుట్టు రాలే సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. మహిళల్లో జుట్టు రాలడం పెద్ద సమస్యగా ఉంది. ఆహారపు అలవాట్లు, జన్నుపరమైన కారణాల వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. జుట్టు రాలడాన్ని నివారించుకునేందుకు చాలా మంది మార్కెట్లో విచ్చలవిడిగా దొరికే కెమికల్స్ వాడడం వల్ల సమస్య మరింత పెరిగిపోతుంది. హెయిర్ ఫోలికల్స్ తగినంత ప్రోటీన్ ను పొందలేని సమయంలో జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి . ఫలితంగా జుట్టు రాలడం జరుగుతుంది. తినే తిండి, తాగే నీరు, జీవనశైలిపై కాస్త శ్రద్ధ వహిస్తే జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు
జుట్టు రాలే సమస్యను కంట్రోల్ చేసుకోవడానికి వెల్లుల్లి బాగా తోడ్పడుతుంది. వెల్లుల్లిలో అధిక పరిమాణంలో పోషకాలు ఉండడం వల్ల జుట్టుకు కావాల్సిన పోషన్ను అందజేసి జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పొడువుగా పెరిగేలా సహాయపడతాయి. సల్ఫర్ లోపం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. వెల్లుల్లి లో సల్ఫర్ ఉండడం వల్ల జుట్టు రాలటాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో ఐరన్ ఎక్కువగా ఉంది. దీన్ని డైరెక్ట్ గా తీసుకుంటా . బాడీలో ఐరన్ కంటెంట్ 7 రోజులలోపు మెరుగుపడుతుంది. జుట్టుకు కావలసిన పోషణను అందించి జుట్టు దృఢంగా ,పొడవుగా పెరిగేలా సహాయపడతాయి.
వెల్లుల్లితో జుట్టుకు ప్యాక్ ;
ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయను తీసుకొని దానిపైన ఉన్న పొరనే తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలువీటన్నింటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పల్చటి క్లాత్ సహాయంతో రసాన్ని వేరు చేసి జుట్టు కుదుళ్ళకి బాగా అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయాలి. వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
అదే విధంగా వెల్లుల్లి రెబ్బలను మెత్తగా పేస్ట్ చేసి, జ్యూస్ తీసి, ఒక టేబుల్ స్పూన్ గార్లిక్ జ్యూస్ ను అరకప్పు కొబ్బరి నూనెలో మిక్స్ చేయాలి.గోరువెచ్చగా వేడి చేసి, ఈ నూనెను తలకుఅ ప్లై చేయాలి. ఒక గంట తర్వాత రెగ్యులర్ షాంపు మరియు కండీషనర్ తో తలస్నానం చేయాలి.
ఒక టీస్పూన్ వెల్లుల్లిరసం, ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం మిక్స్ చేయాలి. తర్వాత కాటన్ బాల్ తీసుకుని తలకు మొత్తానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో తలకు స్నానం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.