Ginger For Healthy Hair : ఆరోగ్యకరమైన జుట్టు కోసం అల్లం ! జుట్టు పెరుగుదలలో దాని అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే..

తలకు అల్లం పూయడం వల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అదే సమయంలో ప్రతి ఒక్క వెంట్రుక కుదుళ్ల కు మేలు చేస్తుంది. అల్లంలో అనేక విటమిన్లు, ఖనిజాలు ,కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. జుట్టు నాణ్యతను పెంచటంలో ఇవన్నీ సహాయపడతాయి.

Ginger For Healthy Hair : ఆరోగ్యకరమైన జుట్టు కోసం అల్లం ! జుట్టు పెరుగుదలలో దాని అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే..

Ginger For Healthy Hair

Ginger For Healthy Hair : పెరుగుతున్న కాలుష్య స్థాయిలు,వాతావరణ మార్పులు రోజువారీ జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ప్రతి ఒక్కరి శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. నిరంతర పర్యావరణ క్షీణత చర్మం , జుట్టు యొక్క ఆరోగ్య పరిస్థితులను ప్రభావితం చేస్తున్నాయి. ఎక్కువ మంది జుట్టు సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాల కోసం సహజమైన, సేంద్రీయ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు.

READ ALSO : Banana Leaves : అరిటాకులో భోజనం ఎందుకు చేస్తారో తెలుసా?

జుట్టు పెరుగుదలకు తోడ్పడే సహజ నివారణల విషయానికి వస్తే, అల్లం ఒక శక్తివంతమైన పదార్ధంగా చెప్పవచ్చు. ఇది జుట్టు సంరక్షణకు తోడ్పడటంలో అందరి దృష్టిని ఆకర్షించింది. శక్తివంతమైన లక్షణాలను కలిగి ఉంది. అల్లం తల చర్మం , జుట్టు కుదుళ్లకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జుట్టు సంరక్షణకు తోడ్పడుతుంది.

భారతదేశంలో, అల్లం అనేది చాలా గృహాలలో సులభంగా దొరుకుతున్న సహజమైన పదార్ధం. అనేక వ్యాధి నివారణల్లో సాంప్రదాయ ఔషదంగా అల్లాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది కడుపు నొప్పికి సాధారణ చికిత్సగా మరియు జలుబు లేదా ఫ్లూ వంటి వచ్చిన సందర్భంలో కూడా సహాయపడుతుంది. సాంప్రదాయ పద్ధతులలో అల్లం మంట , జీర్ణశయాంతర వ్యాధుల కోసం ఉపయోగిస్తారు. అల్లంలోని యాంటీఆక్సిడెంట్ , క్రిమినాశక లక్షణాల కారణంగా, మొటిమలు, చర్మం కాలిన గాయాలు, చుండ్రు, పెళుసు జుట్టు వంటి సమస్యలను పరిష్కరించడానికి కూడా ఉపయోగిస్తారు. జుట్టు రాలడం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Healthy Skin : ఆరోగ్యకరమైన చర్మం కోసం బయోటిన్ రిచ్ ఫుడ్స్ ఇవే !

జుట్టు కోసం అల్లం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ;

1. చుండ్రుతో పోరాడే అల్లం ;

పొడి జుట్టు అనేది ప్రజలు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. సాధారణంగా చుండ్రుతో కూడి ఉంటుంది. అల్లంలో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ , చుండ్రుని ఎఫెక్టివ్‌గా తగ్గించడంలో సహాయపడతాయి. షాంపూలో తాజా అల్లం కలిపి తలకు పట్టించి మసాజ్ చేయడం వల్ల చుండ్రు సమస్యతో బాధపడేవారికి చక్కటి ఫలితాలు లభిస్తుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలలో చిరాకు మరియు దురదను తగ్గించడంలో సహాయపడతాయి.

READ ALSO : Hair health : జుట్టు బలహీనంగా ఉందా? ఆలోచించాల్సిందే !

2. జుట్టు నాణ్యతను పెంచటంలో తోడ్పడే అల్లం ;

తలకు అల్లం పూయడం వల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అదే సమయంలో ప్రతి ఒక్క వెంట్రుక కుదుళ్ల కు మేలు చేస్తుంది. అల్లంలో అనేక విటమిన్లు, ఖనిజాలు ,కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. జుట్టు నాణ్యతను పెంచటంలో ఇవన్నీ సహాయపడతాయి. తద్వారా జుట్టు పొడవుగా, దృఢంగా ఉండేలా చేస్తాయి. దెబ్బతిన్న జుట్టు ను తిరిగి మెరుగు పరుస్తాయి. దీర్ఘకాలంలో జుట్టు దెబ్బతినకుండా కాపాడటంలో , చివర్లు చీలిపోయే అవకాశాలను తగ్గిస్తుంది.

READ ALSO : Benefits Of Niacinamide : జుట్టు ఆరోగ్యానికి నియాసినామైడ్ తో అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసా ?

3. అల్లం జుట్టును కండిషన్ చేస్తుంది ;

అల్లంలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు జుట్టుకు పోషణను అందించడంలో ఉపయోగపడతాయి. ఇది మెరుగైన రూపాన్ని, అనుభూతిని కలిగిస్తుంది. అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు హెయిర్ ఫోలికల్స్‌ను రక్షిస్తాయి. డ్యామేజ్‌ను తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదల చక్రం మెరుగుపడేలా చేస్తుంది.

అల్లాన్ని అనేక రూపాల్లో జుట్టు కోసం ఉపయోగించవచ్చు. అల్లం నూనె రూపంలో లభిస్తుంది. దీనిని అప్లై చేయడం మంచి ఫలితాలను పొందవచ్చు. ఆరోగ్యకరమైన, పొడవాటి,దృఢమైన జుట్టు కోసం అల్లం ఉపయోగించటం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.