Hair health : జుట్టు బలహీనంగా ఉందా? ఆలోచించాల్సిందే !

మన శరీర ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో.. జుట్టు ఆరోగ్యానికి అంతే ప్రాధాన్యత ఇవ్వాలి.. ఎందుకంటే జుట్టు బలహీనంగా ఉండటం ఒక్కోసారి ఇతర అనారోగ్య సమస్యలకు సూచన అని నిపుణులు చెబుతున్నారు.

Hair health : జుట్టు బలహీనంగా ఉందా? ఆలోచించాల్సిందే !

Hair health

Hair health :  ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే అలెర్ట్ అవుతాం. కానీ జుట్టు విషయంలో మాత్రం విస్మరిస్తాం. కొందరిలో సడెన్ గా జుట్టు రాలడం, డ్రైగా మారిపోవడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. ఈ సమస్యలు దీర్ఘకాలంగా వేధిస్తుంటే మాత్రం దృష్టి పెట్టాల్సిందే.

Prevent Hair Loss : జుట్టు రాలడాన్ని నివారించటంతోపాటు జుట్టుకు పోషణనిచ్చే సూపర్ ఫుడ్స్ !

తరచుగా తలస్నానం చేయడం .. జుట్టు దువ్వడం ఉండటం వల్ల జుట్టు రాలడం సహజమే. అది మరీ విపరీతంగా రాలితే కాస్త ఆలోచించాలి. చాలామందిలో థైరాయిడ్, విటమిన్ డి లోపం లేదా రక్తహీనత ఉన్నా కూడా జుట్టు రాలుతుందట. కొందరిలో జుట్టు మరీ పెళసుగా ఉంటుంది. ఇలా ఉండటం జింక్ లేదా ఐరన్ లోపం వల్ల అవుతుందట. సో అలాంటి సమస్య ఉన్నప్పుడు తినే ఆహారంలో ఎక్కువగా మాంసాహారం, గుమ్మడి గింజలు వంటివి చేర్చుకోవాలి.

 

కొందరిలో అధిక ఒత్తిడి కారణంగా కూడా జుట్టు ఊడిపోతుందట. అలాంటి వారిలో ఎక్కువగా జుట్టు బూడిద రంగులోకి మారిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్వులు చాలా అవసరమట. అందుకోసం తినే ఆహారంలో అవకాడో, ఆలీవ్ ఆయిల్, సాల్మన్ వంటివి ఉండేలా చూసుకోవాలి. ఇవి చర్మంతో పాటు స్కాల్ప్‌ను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయట.

experts warning : ప్రెగ్నెంట్ లేడీస్ జుట్టుకి రంగు వేసుకుంటున్నారా? ఎంత ప్రమాదకరమో తెలుసా…

ఇక కొందరిలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది నిరంతరం కనిపించే స్కాల్ప్ సమస్య. నెత్తిమీద విపరీతంగా చికాకు కలిగిస్తుంది. ఇతరులు వాడిన దువ్వెనలు, తువ్వాళ్లు లాంటివి వాడటం ద్వారా కూడా చుండ్రు వ్యాపిస్తుంది. కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా చుండ్రు వచ్చే అవకాశం ఉందట. కుంకుడు, లేదా శీకాయిపొడిని వాడటం ద్వారా చుండ్రును నివారించుకోవచ్చు. జుట్టుకి సంబంధించి ఏ సమస్య తీవ్రంగా ఉన్నా కూడా హెయిర్ స్పెషలిస్ట్‌లను సంప్రదించాలి.