Health Tips: నిల్చొని కాదు కూర్చొని నీళ్లు తాగండి.. మందుల కన్నా పవర్ ఫుల్.. ఎన్నో రోగాలు మాయం
Health Tips: కూర్చొని నీరు తాగేటప్పుడు నెమ్మదిగా తాగుతాం. దీని వలన నీరు చక్కగా శరీరంలో పంచబడుతుంది.

Health benefits of drinking water while sitting
మానవ జీవనంలో నీటికి ప్రత్యేక స్థానం ఉంది. నీరు లేకపోతే జీవితమే లేదు. రోజూ నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయితే నీటిని ఎలా తాగాలి? ఎప్పుడు తాగాలి? నిలబడి తాగాలా? కూర్చొని తాగాలా? అన్నదానిపై చాలామందిలో సందేహాలు ఉన్నాయి. పురాతన ఆయుర్వేదం, యోగా శాస్త్రం, అలాగే ఆధునిక ఆరోగ్య శాస్త్రం ప్రకారం కూడా కూర్చొని నీరు తాగడం అనేది శరీరానికి ఎంతో మేలు చేస్తుందట. నిపుణులు కూడా ఇదే మాటను చెప్తున్నారు. మరి కూర్చొని నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు సహాయపడుతుంది:
కూర్చొని నీరు తాగేటప్పుడు నెమ్మదిగా తాగుతాం. దీని వలన నీరు చక్కగా శరీరంలో పంచబడుతుంది. ఇలా జరగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.
2.మూత్రపిండాలపై తక్కువ ఒత్తిడి:
నిలబడి నీరు తాగడం వల్ల అది వేగంగా మూత్రపిండాలలోకి వెళ్తుంది. దాంతో మూత్రపిండాలపై ఒకేసారి ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కానీ కూర్చొని తాగితే నీరు నెమ్మదిగా మూత్రపిండాలకు చేరడం వల్ల వాటి పనితీరును సహజ స్థాయిలో ఉంటుంది.
3.జీర్ణక్రియ మెరుగవుతుంది:
కూర్చొని నీరు తాగినపుడు జీర్ణ వ్యవస్థ ప్రశాంతంగా పనిచేస్తుంది. నిలబడి తాగినపుడు జీర్ణరసాల ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల ఎసిడిటీ, వాంతులు, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
4.మెటబాలిజం మెరుగవుతుంది:
కూర్చొని నీళ్లు తాగడం వల్ల మెటబాలిజం (Metabolism) మెరుగవుతుంది. కూర్చొని నెమ్మదిగా తాగినపుడు మెటబాలిజం సరిగా జరిగి, శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
5.హృదయానికి హానికరం కాదు:
నిలబడి నీటిని తాగినపుడు రక్తంలో తక్షణ మార్పులు చోటు చేసుకొని హృదయంపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది రక్తపోటు సమస్యలకు దారి తీయవచ్చు. కూర్చొని తాగినపుడు ఈ ఒత్తిడి తక్కువగా ఉంటుంది.
6.మనోధైర్యం, మనశ్శాంతి పెరుగుతుంది:
కూర్చొని నీళ్లు తాగడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మనలో చిత్తశుద్ధి, సమయశీలత వంటి మంచి అలవాట్లను పెంపొందిస్తుంది. ఆరోగ్యంపై మన అవగాహన బలపడుతుంది.
ముఖ్య సూచనలు:
- కూర్చొని నెమ్మదిగా తాగాలి – నిలబడి లేదా తిరుగుతూ తాగకూడదు
- గ్లాస్ లేదా మట్టికుండలో తాగాలి – బాటిల్ నుండి నేరుగా వేగంగా తాగకూడదు
- ఆకలితో తినే ముందు నీరు తాగవచ్చు – అన్నం తింటున్నప్పుడు అధికంగా తాగకూడదు.