Dry Anjeer Benefits: సాయంత్రం స్నాక్స్ కి బదులు ఇవి తినండి.. ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?
అంజీర్ పండ్లలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించి, రక్తం తయారయ్యేలా చేస్తుంది.

Dry Anjeer Benefits
సాయంత్రం అయ్యింది అంటే చాలు మంది స్నాక్స్ తింటారు. అందులో కూడా పిజాలు, బర్గర్ లు, మిర్చీలు వంటి వాటిని ఎక్కువగా తింటారు. కానీ, ఇవి ఆరోగ్యనైకి చాలా చేస్తాయి. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల రోగాల బారిన పడుతున్నారు. అందుకే సాయంత్రం స్నాక్స్ సమయంలో కూడా ఆరోగ్యనైకి మేలు చేసి ఆహరం తీసుకుంటే మంచిది. అవి ఆకలిని తీర్చడమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అలాంటి వాటిలో అంజీర్ ఒకటి. ఈ మధ్య కాలంలో డ్రై ఫ్రూప్ట్స్ గా వీటిని ఎక్కువగా తీసుకునున్నారు. కానీ, ఇదే అంజీర్ ని ఈవెనింగ్ స్నాక్స్ లా కూడా తీసుకోవచ్చు. రోజు రెండు మూడు అంజీర్ పండ్లను ఉదయం నీటిలో నానబెట్టి సాయంత్రం స్నాక్స్ ల తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
అంజీర్ పండ్లలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించి, రక్తం తయారయ్యేలా చేస్తుంది. కణాలకు ఆక్సిజన్ ఎక్కువగా అందేలా చేసి ఆయాసం, నీరసం, అలసట రాకుండా చేస్తుంది. అంజీర్ పండ్లలో ఉండే ఫాస్ఫరస్ ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది. ఈ పండ్లలో ఉండే మాంగనీస్ ఎముకల నిర్మాణానికి సహాయపడుతుంది. మెటబాలిజంను, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంజీర్ లోని కొన్ని సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, వాపులు, నొప్పులు రాకుండా చేస్తుంది. అంజీర్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చేస్తుంది.
అంజీర్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధ పడేవారికి అంజీర్ ఉపశమనాన్ని ఇస్తుంది. అంజీర్ పండ్లలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా, చేస్తుంది. కండరాలను పటిష్టంగా చేసి నొప్పులను తగ్గిస్తుంది. అంజీర్ లో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. అంజీర్ పండ్లలో మెగ్నిషియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది శరీరంలోని 300కు పైగా జీవ రసాయనిక చర్యలను ప్రేరేపిస్తుంది. కాబాట్టి ఈవెనింగ్ స్నాక్స్ గా అంజీర్ పండ్లను తినడం వల్ల అనేకమైన ప్రయోజనాలు పొందవచ్చు.