Onion Benefits: పచ్చి ఉల్లితో పుట్టెడు లాభాలు.. గుండె, షుగర్ అన్నీ సేఫ్.. ఇంకా చాలానే ఉన్నాయి

Onion Benefits: పచ్చి ఉల్లిపాయలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది.

Onion Benefits: పచ్చి ఉల్లితో పుట్టెడు లాభాలు.. గుండె, షుగర్ అన్నీ సేఫ్.. ఇంకా చాలానే ఉన్నాయి

Health benefits of eating raw onions

Updated On : August 4, 2025 / 2:01 PM IST

ఉల్లిపాయ.. ఇది లేని వంటను ఊహిచుకోవడం కష్టం. అంతలా మన ఆహరంలో భాగంగా మారిపోయింది ఉల్లి. అయితే, ఉల్లి కేవలం రుచికే కాదు అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందట. అందుకే మన పెద్దలు కూడా అంటుంటారు కదా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదని. అయితే కేవలం వంటనల్లోనే కాదు పచ్చి ఉల్లి తినడం వల్ల కూడా అనేకరకాల లాభాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. మరి ఆ లాభాలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1.ఇమ్యూనిటీ పెంపు:
పచ్చి ఉల్లిపాయలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది. తరచూగా వచ్చే జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం ఇస్తుంది.

2.షుగర్ లెవల్స్ నియంత్రణ:
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్, క్రోమియం అనే ఖనిజ పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారు ఇది మితంగా తీసుకుంటే చాలా ఉపయోగకరం.

3.గుండె ఆరోగ్యానికి మంచిది:
పచ్చి ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల రిస్క్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే హై బీపీని నియంత్రిస్తుంది, రక్త స్రావాన్ని సమన్వయం చేస్తుంది.

4. కొలెస్ట్రాల్ నియంత్రణ:
పచ్చి ఉల్లిపాయ HDL (మంచి కొలెస్ట్రాల్) స్థాయిని పెంచి, LDL (కీడు కొలెస్ట్రాల్) స్థాయిని తగ్గిస్తుంది. తద్వారా గుండెపోటు (హార్ట్ అటాక్) ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5.జీర్ణక్రియ మెరుగుపరచడం:
ఉల్లిపాయలో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. మితంగా తీసుకోవడం అజీర్తి, గ్యాస్, మలబద్ధక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

6.యాంటీసెప్టిక్, యాంటీబాక్టీరియల్ లక్షణాలు:
పచ్చి ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కాంపౌండ్ శరీరంలోని సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. గాయాలపై కూడా ఉల్లిపాయ రసం రాసినట్లయితే బ్యాక్టీరియా నశిస్తుంది.

7.క్యాన్సర్ నివారణ:
కాన్సర్ జన్యక కణాల వృద్ధిని నిరోధించే యాంటీఆక్సిడెంట్లు ఉల్లిపాయలో ఉంటాయి. ముఖ్యంగా మలద్వార, కడుపు, ప్రొస్టేట్ క్యాన్సర్ల రిస్క్ తగ్గించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.

8.చర్మ, జుట్టుకు మేలు:
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కణాలు జుట్టు పెరుగుదలలో సహాయపడతాయి. అలాగే, చర్మం పై మచ్చలు, మొటిమలను ఇది తగ్గిస్తుంది.

9.ఎముకల బలానికి సహాయం:
పచ్చి ఉల్లిపాయ క్రమంగా తీసుకుంటే, కాళ్లు, చేతుల ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. ముఖ్యంగా మహిళలలో మెనోపాజ్ అనంతర కాలంలో ఎముకలు బలహీనపడకుండా ఇది చూసుకోగలదు.

10. వేడి నుంచి రక్షణ:
వేసవి కాలంలో ఉల్లిపాయ శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, హీట్ స్ట్రోక్‌ నుంచి రక్షించగలదు. అందుకే పచ్చి ఉల్లిపాయను బుట్టనివ్వడంలో భాగంగా వాడతారు.