Frozen Chicken Disadvantages: ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా? పెద్ద తప్పుచేస్తున్నారు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Frozen Chicken Disadvantages: చికెన్ చాలా సేపు ఫ్రీజింగ్ చేయడం వల్ల కొన్ని విటమిన్లు తగ్గిపోతాయి. ప్రాసెసింగ్ సమయంలో మాంసంలోని సహజ గుణాలు కొంత మేర నష్టమవుతాయి.

Health problems caused by eating frozen chicken
చికెన్ అనేది మనరోజు వారి ఆహరంలో భాగంగా మారిపోయింది. మంచి ప్రోటీన్ ఆహారం కూడా. కాబట్టి, దీనిని తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ, ఎలా తింటున్నాం, ఎలాంటి చికెన్ తింటున్నాం అనేది చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో చాలా వినిపిస్తున్న మాట ఫ్రోజెన్ చికెన్. అసలు ఫ్రోజెన్ అంటే ఏంటంటే? మాంసాన్ని తాజా స్థితిలో నిల్వ చేయడం. తక్కువ ఉష్ణోగ్రతల్లో నిల్వచేసే పద్ధతి. ఇలా చేయడం వల్ల చికెన్ చాలా కాలం నిల్వ ఉంటుంది. అయితే, ఇలాంటి చికెన్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని నిపుణులు చెప్తున్నారు. మరి ఆ సమస్యలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రోజెన్ చికెన్ రెండు రకాలుగా లభిస్తుంది:
రా ఫ్రోజెన్ చికెన్: శుభ్రంగా కడిగి, ప్యాక్ చేసి, తినే ముందు వండాల్సినది.
ప్రి-కుక్‌డ్ ఫ్రోజెన్ చికెన్: ముందే కొంతవరకు వండినదాన్ని ఫ్రీజ్ చేస్తారు.
ఫ్రోజెన్ చికెన్ ఎందుకు వాడతారు?
- ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది
- ప్రయాణాల్లో ఉపయోగించవచ్చు
- రెస్టారెంట్లు/హోటళ్లలో స్టాక్ చేసుకోవడం సులభం
- తక్కువ సమయంతో వండే వీలుగా ఉంటుంది
ఫ్రోజెన్ చికెన్ తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు:
1.పోషకాల నష్టం:
చికెన్ చాలా సేపు ఫ్రీజింగ్ చేయడం వల్ల కొన్ని విటమిన్లు తగ్గిపోతాయి. ప్రాసెసింగ్ సమయంలో మాంసంలోని సహజ గుణాలు కొంత మేర నష్టమవుతాయి.
2.బాక్టీరియా పెరుగుదల ప్రమాదం:
ఫ్రోజెన్ చికెన్‌ను సరైన రీతిలో డిఫ్రోస్ట్ చేయకపోతే, సాల్మొనెల్లా (Salmonella), ఇ.కోలై (E.coli), లిస్టీరియా (Listeria) వంటి ప్రమాదకర బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.
3.అధిక సోడియం:
కొన్ని ఫ్రోజెన్ చికెన్ ఉత్పత్తుల్లో ప్రిజర్వేటీవ్స్, సోడియం-బేస్డ్ కెమికల్స్ వాడుతారు. ఇవి అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు కలిగించే ప్రమాదం ఉంది.
4.క్యాన్సర్ ప్రమాదం:
WHO నివేదికల ప్రకారం, ప్రాసెస్డ్, దీర్ఘకాలికంగా నిల్వ చేసిన మాంసం తరచుగా తీసుకుంటే కొలన్ క్యాన్సర్, గాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
5.ఊబకాయ ప్రమాదం:
ఫ్రోజెన్ చికెన్ ఎక్కువగా ఫ్రై చేసి తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్, ట్రాన్స్ఫ్యాట్, అధిక క్యాలొరీలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఊబకాయం, డయబెటిస్ వంటి సమస్యలు వస్తాయి.
6.అలెర్జీ సమస్యలు:
ప్రాసెసింగ్ సమయంలో కొన్నిసార్లు అజ్ఞాత రసాయనాలు లేదా ప్రోటీన్లు కలవచ్చు, ఇవి కొంతమందిలో అలెర్జీ సమస్యలకు కారణం అవొచ్చు.
ఫ్రోజెన్ చికెన్ అనేది సౌలభ్యం కోసం తీసుకొచ్చిన మార్గం. కానీ దీన్ని తరచూ, ఎక్కువగా తీసుకోవడం శరీరానికి మంచిది కాదు.
తాజా, సహజ మాంసం వీలైనంత వరకు వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రోజన్ చికెన్ వాడుతున్నప్పుడు శుద్ధత, నిల్వ విధానం, వండే పద్ధతులపై జాగ్రత్త వహించాలి.