Belt disadvantages: మీరు బెల్ట్ టైట్ గా పెట్టుకుంటున్నారా.. పిల్లలుపుట్టే సామర్థ్యం తగ్గిపోవచ్చు జాగ్రత్త.

బెల్టు టైట్ ధరించడం వల్ల జననాంగాలకు రక్త ప్రసరణ సరిగా జరగకపోవచ్చు. దానివల్ల వృషణాలు ఇతర సంతానోత్పత్తి అవయవాల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది.

Belt disadvantages: మీరు బెల్ట్ టైట్ గా పెట్టుకుంటున్నారా.. పిల్లలుపుట్టే సామర్థ్యం తగ్గిపోవచ్చు జాగ్రత్త.

Belt wearing tightly

Updated On : June 14, 2025 / 12:34 PM IST

ప్రస్తుత కాలంలో బెల్ట్ ధరించడం అనేది సాధారణం. ఫార్మర్స్ ధరించేవాళ్ళు తప్పనిసరిగా బెల్ట్ పెట్టుకుంటారు. కానీ, బెల్ట్ ధరించడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయట. నిజానికి ఈ విషయం విస్మయానికి గురి చేస్తుంది. బెల్ట్ ధరించడం మంచిదే కానీ, బిగుతుగా ధరించడం వల్ల జననాంగ సమస్యలు, సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా మగవాళ్ళలో ఉండే వృషణాలు చాలా చల్లగా ఉండాలి. బెల్ట్ ధరించడం వల్ల వృషణాల వద్ద ఉష్ణోగ్రత ఎక్కువై శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోతుందట. సంతానం కలగడంలో శుక్రకణాలు చాలా ప్రధానం. కాబట్టి, దీనివల్ల సంతానలేమి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

మరో విషయం ఏంటంటే.. బెల్టు టైట్ ధరించడం వల్ల జననాంగాలకు రక్త ప్రసరణ సరిగా జరగకపోవచ్చు. దానివల్ల వృషణాలు ఇతర సంతానోత్పత్తి అవయవాల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే జనన భాగాల్లో ఎక్కువ కాలం ఒత్తిడి ఏర్పడి వాపు, వెరికోసెల్ లాంటి సమస్యలు రావచ్చు. అంతేకాకుండా.. బెల్టును బిగుతుగా ధరించడం వల్ల జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశముంది. ఒత్తిడి వల్ల అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్ లాంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఇంకా చాలా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. కాబట్టి బెల్టులు ధరించే విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం.

సౌకర్యవంతమైన బెల్టులు ధరించడం మంచిది. దీనివల్ల శరీరంలోకి గాలి ప్రవాహం మెరుగుపడి. గాలి ప్రసరణ జరగడం వల్ల వృషణాల వద్ద అధిక ఉష్ణోగ్రత రావడం తగ్గుతుంది. ఎక్కువ సమయం కూర్చున్నప్పుడు కూడా కొన్నిసార్లు నడుము భాగంలో రక్త ప్రవాహం మెరుగుపరచుకోవాలి. సాధ్యమైనంతవరకు బెల్టు లేకుండా ఉండే దుస్తులను ఎంచుకోవడం ఉత్తమం.