Sperm Count: మగవాళ్ళు జాగ్రత్త.. బిల్ పేపర్ పట్టుకుంటే స్పెర్మ్ కౌంట్ ఢమాల్.. షాకింగ్ రీసెర్చ్

Sperm Count: బిస్ఫెనాల్-S (BPS) అనేది ఒక రసాయన పదార్థం. ఇది బిస్ఫెనాల్-A (BPA)కు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు.

Sperm Count: మగవాళ్ళు జాగ్రత్త.. బిల్ పేపర్ పట్టుకుంటే స్పెర్మ్ కౌంట్ ఢమాల్.. షాకింగ్ రీసెర్చ్

Holding bill receipts for 10 seconds may decrease your sperm count

Updated On : August 4, 2025 / 2:42 PM IST

ఆధునిక జీవనశైలిలో మనం ఉపయోగించే ఎన్నో వస్తువుల నుంచి హానికరమైన రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. అందులో ఒకటి బిస్ఫెనాల్-S. ఇది బిల్ రసీదులు, ప్లాస్టిక్ వస్తువులు, ప్యాకేజింగ్ పదార్థాలు వంటి వాటిలో కనిపిస్తుంది. కాబట్టి, మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందులో, ఒకటి వీర్యకణాల తగ్గిపోవడం. అవును, బిల్ పేపర్‌పై ఉండే బిస్ఫెనాల్ S స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుందట. ప్రస్తుతం ఈ అంశం ఆందళనల కలిగిస్తోంది. కాబట్టి, బిస్ఫెనాల్-S తో ప్రమాదం ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది విషయం గురించి వివరంగా తెలుసుకుందాం.

బిస్ఫెనాల్-S అంటే ఏమిటి?

బిస్ఫెనాల్-S (BPS) అనేది ఒక రసాయన పదార్థం. ఇది బిస్ఫెనాల్-A (BPA)కు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. BPA వాడకం మానవులకు హానికరం కాబట్టి చాలామంది తయారీదారులు BPAని తొలగించి దాని బదులు BPSని ఉపయోగిస్తున్నారు. కానీ తాజా పరిశోధనలు చెప్పేది ఏంటంటే BPS కూడా అంతే ప్రమాదకరం అని, ముఖ్యంగా హార్మోన్‌లపై ప్రభావం చూపే పదార్థంగా పనిచేస్తుంది.

బిల్ రసీదుల్లో BPS ఎలా ఉంటుంది?

మనం రరోజు వెళ్లే షాపింగ్ మాల్స్ లో ఇచ్చే థర్మల్ బిల్ పేపర్లపై బిస్ఫెనాల్-S రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఈ పేపర్లను మన వేల్లతో తాకినప్పుడు BPS రసాయనం శరీరంలోకి ప్రవేశిస్తుంది. కొన్నిసార్లు ఆ బిల్ చేతిలో పట్టుకొని ఆహారాన్ని తినటం వల్ల అది నేరుగా నోటిలోకి చేరే ప్రమాదం కూడా ఉంది.

స్పెర్మ్ కౌంట్‌పై BPS ప్రభావం:

ఇది హార్మోన్‌లను అడ్డుకుంటుంది:
BPS మన శరీరంలోని ఎస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల ప్రక్రియను దెబ్బతీస్తుంది. ఇది హార్మోనల్ అసమతుల్యతను కలిగిస్తుంది.

స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తుంది:
పురుషులపై జరిగిన పరిశోధనల్లో BPS ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం గమనించారు. స్పెర్మ్ కౌంట్ మాత్రమే కాకుండా, స్పెర్మ్ మొబిలిటీ కూడా తగ్గుతుంది. క్రమంగా ఈ ప్రభావం సంతానలేమి కి దారి తీసే అవకాశముంది.

జన్యుశాస్త్రీయ మార్పులు:
కొన్ని పరిశోధనలు చూపించిన దాని ప్రకారం, BPS కారణంగా స్పెర్మ్‌లో DNA నష్టమవడం కూడా జరుగవచ్చని తెలుస్తోంది. దీని వల్ల పుట్టే పిల్లలలో జన్యు లోపాలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు:

  • బిల్ పేపర్‌కి తాకకుండా ఉండండి.
  • ఒకవేళ బిల్ తీసుకున్నాక వెంటనే చేతులు కడగాలి.
  • తాకిన వెంటనే ఆహారం తినకండి.
  • పిల్లల కోసం ప్రయత్నిస్తున్న పురుషులు BPS పదార్థాలకు దూరంగా ఉండాలి.