రోజుకి ఎన్ని గుడ్లు తినగలరు?

రోజుకి ఎన్ని గుడ్లు తినగలరు?

Updated On : August 24, 2020 / 5:08 PM IST

ఏ వయసు వారికైనా ఇష్టమైన పౌష్టికాహారం రోజుకొక గుడ్డు. అందరికీ అందుబాటు ధరలో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థం ఏదైనా ఉందంటే అది గుడ్డు మాత్రమే. ఇందులో విటమిన్ D, విటమిన్ b6, విటమిన్ b12, జింక్, రాగి మరియు ఇనుము అధికంగా ఉంటాయి.

ఇక పెరుగుతున్న పిల్లలకు, గేమ్స్ ఆడేవారికి, అనారోగ్యం నుండి కోలుకొని వ్యక్తులు మరియు సాధారణంగా ప్రతి ఒక్కరికి గుడ్డు బాగా పోషకాలు అందిస్తుంది. కానీ గుడ్డులో కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. దీంతో ఒక రోజులో ఎన్ని గుడ్లు తినడం వల్ల మన ఆరోగ్యానికి సురక్షితం అనే ప్రశ్న తలెత్తింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం…. ఒక రోజులో 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ కంటే ఎక్కువ తినకూడదు. కానీ మొత్తం గుడ్డులో 373 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి గుండె రోగాలు ఉన్నవారు గుడ్లు తినడం మానే యాల అని పరిక్షిస్తున్నారు. మరియు గుండె సమస్యలు లేని వ్యక్తులు గురించి ఏమిటి అనే ఆలోచనలో పడ్డారు.

ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటంటే… రోజుకు ఒక్క గుడ్డు తినడం పూర్తిగా సురక్షితం మరియు ఆరోగ్యకరమైన పురుషులు మరియు మహిళలు గుండె సమస్యలను దగ్గరకి రాకుండా చేయడంలో సహాయపడుతుంది. వాస్తవానికి రోజుకు రెండు, మూడు గుడ్లు తినడం వల్ల జనాభాలో మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే అవకాశం లేదు. అయినప్పటికీ ఇది మధుమేహంతో బాధపడే వారికి ఈ సమస్య కావచ్చు.

మరింత డేటాను తెలుసుకోవడం కోసం జనాభా ఆరోగ్య పరిశోధన సంస్థ నిర్వహించిన మూడు అంతర్జాతీయ అధ్యయనాలను పరిశోధకులు విశ్లేషించారు. అధ్యయనం కోసం 21 దేశాలు, 6 ఖండాల నుంచి 1,46,011 మందిని అంచనా వేశారు.