నిద్రలో గురక వస్తుందా? కరోనాతో మరణించే అవకాశం 3 రెట్లు ఎక్కువ.. వైద్యులు హెచ్చరిక

నిద్రలో గురక వస్తుందా? అయితే కరోనాతో జాగ్రత్త.. పెద్దగా గురక పెట్టేవారిలో కరోనాతో మరణించే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉండొచ్చునని వైద్యలు హెచ్చరిస్తున్నారు. గురక సమస్య అధికంగా ఉన్నవారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. నిద్రించే సమయంలో గొంతులోని కండరాలు రిలాక్స్ అవుతాయి.. దీంతో శ్వాసకోశాలు మూసుకపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.
దీంతో గాలి పీల్చడం వదలడం కష్టంగా మారుతుంది.. కోవిడ్ రోగుల్లో చాలామందిలో గురక సమస్య అధికంగా ఉందని Warwick యూనివర్శిటీ పరిశోధకులు గుర్తించారు. sleep aponea సమస్యతో బాధపడే కోవిడ్ రోగులు మరణించే ముప్పు అధికంగా ఉందని హెచ్చరిస్తున్నారు. గురక సమస్య ఉన్నవారికి కోవిడ్ సోకిన వెంటనే సాధ్యమైంత తొందరగా ఆస్పత్రిలో చికిత్స అందించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.
ఎవరికి ముప్పు ఎక్కువంటే? :
sleep apnoea (గురక) సమస్య రావడానికి ఆరోగ్యపరంగా చాలా కారణాలు ఉన్నాయి.. అందులో డయాబెటిస్, ఒబెసిటీ, హైపర్ టెన్షన్ ఉన్నవారికి ముప్పు అధికంగా ఎక్కువగా ఉంటుంది.. వీరికి కరోనా సోకితే మాత్రం మరణించే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెల వరకు పరిశీలించిన 18 అధ్యయనాల్లో.. గురక సమస్యతో బాధపడేవారిలో 10 మందిలో 8 మంది మరణ ముప్పును ఎదుర్కొంటున్నారు.. కరోనా సోకిన డయాబెటిస్ రోగులపై భారీస్థాయిలో అధ్యయనం నిర్వహించారు. ఇందులో నిద్రలో గురక సమస్యకు చికిత్స తీసుకునేవారిలో 2.8 రెట్లు అధిక మరణ ముప్పు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
sleep apnoea సమస్యతో బాధపడేవారు కరోనాతో ఆస్పత్రి పాలైతే మాత్రం వారు చేరిన ఏడో రోజులోనే మరణించే ప్రమాదం ఎక్కువ రిస్క్ ఉంటుందని హెచ్చరించారు. నిపుణుల్లో ఒకరైన Dr Michelle Miller మాట్లాడుతూ.. నిద్ర సమస్యకు, కరోనా మధ్య ఎలాంటి సంబంధం ఉందో అర్థం చేసుకోవాలంటే మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని చెప్పారు. యూకేలో ప్రస్తుతం గురక సమస్యతో 1.5 మిలియన్ల మంది బాధపడుతున్నారు. వీరిలో 85 శాతం కేసులను నిర్ధారించలేమని పరిశోధకులు చెబుతున్నారు.