Immunity Boosting : రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్!

పెరుగులో.. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రొటీన్, కాల్షియం వంటి ఆరోగ్యవంతమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ లో పెరుగు చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలకు కావాల్సిన ఖనిజాలను అందిస్తుంది.

Immunity Boosting : రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్!

Immunity Boosting Super Foods

Immunity Boosting : ఇడ్లీ.. వడ.. దోశ.. ఏంటి హోటల్ టిఫిన్ లిస్ట్ చెబుతున్నారనుకుంటున్నారా? మన రోజు మొదలయ్యే ఆహారాల లిస్ట్ ఇది. ఇవి కాకుండా బ్రేక్ ఫాస్ట్ డైట్ లో చేర్చాల్సిన కొన్ని రకాల ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకొని తీరాల్సిందే! ఎందుకంటే వీటి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మరి.

రోజంతా మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. సరైన ఆహారం తీసుకోకపోతే అనారోగ్యాలపాలవుతాం. ఈ విషయం తెలిసి కూడా చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అందులోనూ బ్రేక్ ఫాస్ట్ విషయానికొచ్చేసరికి చాలా అలక్ష్యం చేస్తుంటారు.

READ ALSO : Soft Drinks : రోజుకో గ్లాసు కూల్ డ్రింక్ సిప్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!

అల్పాహారం.. రోజులో మొదటి భోజనం. ఇది కచ్చితంగా కడుపు నిండేలా ఉండాలి. ఎక్కువ గంటలు నిండుగా ఉంటేనే రోజంతా మనం శక్తివంతంగా పని చేస్తాం. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా ఉదయం రోగనిరోధక శక్తిని పెంచే ఈ ఫుడ్ ను మీ జాబితాలో చేర్చండి.

సిట్రస్ఫ్రూట్స్ :

నారింజ, నిమ్మ, ద్రాక్షపండ్లు.. ఇలా పుల్లటి పండ్లన్నీ సిట్రస్ కి సంబంధించినవి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ఫ్లేవినాయిడ్స్ వంటి అనేక పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉఫయోగపడుతాయి. సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

READ ALSO : Rahul Gandhi: మోదీ చెప్పేవన్నీ అబద్ధాలే.. భారత్ భూభాగంలోకి చైనా సైన్యం ప్రవేశించింది ..

పెరుగు :

పెరుగులో.. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రొటీన్, కాల్షియం వంటి ఆరోగ్యవంతమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ లో పెరుగు చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలకు కావాల్సిన ఖనిజాలను అందిస్తుంది. పెరుగులో ఉండే బి12 వల్ల గుండె జబ్బులు దరిచేరవు. ఇందులో ఉండే మంచి ప్రోబయోటిక్స్ ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. అనేక వైరల్ ఇన్ ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

ఆకుకూరలు :

బచ్చలికూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు.. ఇలాంటి పచ్చని ఆకుకూరలు పోషకాల శక్తి కేంద్రాలు. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాటిలో అధిక స్థాయిలో విటమిన్ సి, కె, బీటా కెరోటిన్, ఫోలేట్, ఫైబర్స్.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

READ ALSO : Tirumala: అలా చేయొద్దు.. తిరుమల కొండపైకి నడక మార్గంలో ప్రయాణించే భక్తులకు టీటీడీ కీలక సూచన..

వెల్లుల్లి :

వెల్లుల్లి రోజుకు ఒకటి తింటే ఎలాంటి అనారోగ్యమూ దరిచేరదంటారు పెద్దలు. ఇందులో ఔషధ గుణాలు అధికం. అందుకే ఉదయం తినే ఆహారంలో వెల్లుల్లిని అధికంగా చేర్చుకోండి. ఇందులో బ్యాక్టీరియాతో పోరాడడానికి అనేక పోషకాలుంటాయి. తక్కువ కేలరీలు ఉండే ఇవి రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులు, అనారోగ్యాల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతాయి.

నట్స్ :

డ్రై ఫ్రూట్స్.. బాదం, జీడిపప్పు, ఇతర నట్స్అన్నిటిలో పుష్కలంగా ప్రోటీన్స్, ఫైబర్ ఉంటాయి. అంతేకాదు.. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వు, విటమిన్లు, మినరల్స్ వంటి అవసరమైన పోషకాలుంటాయి. ఇవి బాడీని ఫిట్ గా ఉంచుతాయి. ఇందులో ఉంటే విటమిన్ ఇ, మాంగనీస్, మెగ్నీషియం, రిబోఫ్లావిన్, నియాసిన్ వంటివి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.