Numbness Effects: చేతులు, కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయా.. ఇది పక్షవాతమేనా.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే

Numbness Effects: సాధారణంగా తిమ్మిరి అనేది నరాలపై ఒత్తిడి కలిగినప్పుడు వస్తుంది. ఇది చాలా సాధరణ సందర్భాలలో జరిగేది.

Numbness Effects: చేతులు, కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయా.. ఇది పక్షవాతమేనా.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే

Is numbness in the legs and arms a sign of paralysis?

Updated On : August 5, 2025 / 2:27 PM IST

చాలా మందిలో చేతులు లేదా కాళ్ళు తిమ్మిర్లు రావడం అనేది సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇది తాత్కాలికం కావొచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక సమస్య కూడా కావొచ్చు. కొన్ని సందర్భాలలో తీవ్ర ఆరోగ్య సమస్యగా కూడా మారవచ్చు. ఇది మెదడు నుండి నరాలకు, నరాల నుండి శరీర భాగాలకు సంబంధించి సరిగ్గా సంకేతాలు అందకపోవడం వలన కలుగుతుంది. కాబట్టి, ఇది నిర్లక్ష్యం చేసే అంత చిన్న సమస్య కాదు. కాబట్టి, ఈ సమస్య ఉన్నవారు ఆరోగ్యం పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి, అసలు ఈ తిమ్మర్లు రావడానికి కారణం ఏంటి? నివారణ చర్యలు ఏంటి? అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

తిమ్మిర్లు రావడానికి ప్రధాన కారణాలు:

1.నరాలపై ఒత్తిడి:

సాధారణంగా తిమ్మిరి అనేది నరాలపై ఒత్తిడి కలిగినప్పుడు వస్తుంది. ఇది చాలా సాధరణ సందర్భాలలో జరిగేది. ఒత్తిడి కారణంగా రక్త ప్రసరణ ఆగిపోతుంది ఆ సమయంలో తిమ్మరి వచ్చే అవకాశం ఉంది.

2.నరాల నష్టం:

డయాబెటిక్ న్యూరోపతి, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, స్కియాటికా వంటి సమస్యల వల్ల శరీరంలోని నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. వీటి వల్ల కూడా తిమ్మిర్లు వస్తాయి.

3.పోషక లోపాలు:

శరీరంలో పోషకాల లోపం వల్ల కూడా తిమ్మిరి సమస్య రావొచ్చు. వాటిలో ముఖ్యంగా విటమిన్ B12 లోపం. ఇది నరాల ఆరోగ్యానికి చాలా కీలకం. ఇది తక్కువగా ఉన్నప్పుడు చేతులు, కాళ్ళు తిమ్మిర్లు రావచ్చు. అలాగే విటమిన్ D, B6 కూడా నరాల పనితీరుపై ప్రభావం చూపుతాయి.

4.డయాబెటిస్:

రక్తంలో గ్లూకోజ్ స్థాయి అధికంగా ఉండడం వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల కూడా తిమ్మిర్లు రావడం సహజం. కొన్నిసార్లు తిమ్మిర్లు రావడం డయాబెటీస్ కి సంకేతం కావచ్చు.

5.ఔషధాల దుష్ఫలితాలు:

కొన్ని రకాల మందులు ఉదాహరణకి క్యాన్సర్ చికిత్సలలో ఉపయోగించే కెమోథెరపీ ఔషధాలు, కొన్ని యాంటీబయాటిక్స్ నరాలపై దుష్ప్రభావం చూపిస్తాయి. వీటిని అధికంగా వాడటం వల్ల కూడా తిమ్మిర్ల సమస్య రావచ్చు.

6.ఆందోళన, మానసిక ఒత్తిడి:

స్ట్రెస్ లేదా పానిక్ అటాక్స్ సమయంలో కూడా శరీరంలో తిమ్మిర్లు రావచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా చేతి, కాళీ వేళ్లలో తమ్మిర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

నివారణ చర్యలు:

1.సరైన శరీర స్థితి:
ఎక్కువసేవు ఒక్క పొజిషన్‌లో కూర్చోవడం, నిలబడటం చేయకూడదు. ప్రతి 30 నుంచి 40 నిమిషాలకు ఒకసారి నడవడం, కదలడం చేయాలి.

2.పోషకాహారం తీసుకోండి:
విటమిన్ B12, B6, D, మెగ్నీషియం వంటివి ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. పాల, గుడ్లు, మాంసాహారం, ఆకుకూరలు, గింజలు లాంటివి ఎక్కువగా తినాలి.

3.వ్యాయామం చేయాలి:
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక, యోగా, స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది.

4.షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవాలి:

డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ లో ఉంచుకోవాలి. ఇది నరాల నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

తిమ్మిర్లు ఒక్కసారిగా ప్రారంభమై, బలహీనత, మాట్లాడలేకపోవడం, మతిపోవడం వంటి లక్షణాలతో ఉంటే, వెంటనే అత్యవసర వైద్యం తీసుకోవాలి. ఇది స్ట్రోక్ కు సంకేతం కావచ్చు.