Mfine Oxygen Tool : కరోనా సెకండ్ వేవ్ భయపెడుతున్న వేళ గుడ్ న్యూస్… స్మార్ట్ ఫోన్‌లోనే బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్..

కరోనా సోకిన వ్యక్తిలో కనిపించే ప్రధాన లక్షణం శరీరంలో ఆక్సీజన్ లభ్యత సరిగ్గా అందకపోవడం. దీన్ని కనుగొనేందుకు పల్స్ ఆక్సీమీటర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆక్సీమీటర్ ద్వారా గుండె కొట్టుకునే వేగంతో పాటు శరీరానికి సరైన మొత్తంలో ఆక్సిజన్‌ అందుతుందో లేదో కనుగొనొచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న తరుణంలో పల్స్‌ ఆక్సీమీటర్‌ కు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. అలాగే గ్లూకోమీటర్‌, బ్లడ్‌ ప్రజర్‌ మానిటర్‌ వంటి గ్యాడ్జెట్స్‌ బాగా యూజ్ ఫుల్ అవుతాయి. అందుకే ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తెగ కొంటున్నారు. అయితే ఇవి కొనలేని వారి పరిస్థితి ఏంటి ? ఈ ఆలోచనలోంచే పుట్టింది

MFine Oxygen Tool : కరోనా సోకిన వ్యక్తిలో కనిపించే ప్రధాన లక్షణం శరీరంలో ఆక్సీజన్ లభ్యత సరిగ్గా అందకపోవడం. దీన్ని కనుగొనేందుకు పల్స్ ఆక్సీమీటర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆక్సీమీటర్ ద్వారా గుండె కొట్టుకునే వేగంతో పాటు శరీరానికి సరైన మొత్తంలో ఆక్సిజన్‌ అందుతుందో లేదో కనుగొనొచ్చు.

ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న తరుణంలో పల్స్‌ ఆక్సీమీటర్‌ కు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. అలాగే గ్లూకోమీటర్‌, బ్లడ్‌ ప్రజర్‌ మానిటర్‌ వంటి గ్యాడ్జెట్స్‌ బాగా యూజ్ ఫుల్ అవుతాయి. అందుకే ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తెగ కొంటున్నారు.

అయితే ఇవి కొనలేని వారి పరిస్థితి ఏంటి ? ఈ ఆలోచనలోంచే పుట్టింది బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ మీటర్‌. హెల్త్ స్టార్టప్ ఎంఫైన్(MFine) ఈ టెక్నాలజీ రూపొందించింది. ఈ సంస్థ తయారుచేసిన ఎంఫైన్‌ పల్స్‌ టూల్ ద్వారా మీ బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్‌ను స్మార్ట్‌ ఫోన్‌ తో చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ బీటా వర్షన్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ ఫామ్‌ లో రిలీజ్ అయింది. ఐఓఎస్ డివైజ్‌ లకు త్వరలో రానుంది.

* గూగుల్ ప్లేస్టోర్ నుంచి MFine యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* ఆ తర్వాత ఈ యాప్ ఓపెన్ చేయాలి.
* అందులో Mpulse పైన క్లిక్ చేయండి.
* స్మార్ట్‌ఫోన్ కెమెరా, ఫ్లాష్ ఆన్‌ చేయాల్సి ఉంటుంది.
* కెమెరా, ఫ్లాష్ లైట్‌పైన మీ చేతి వేలిని పెట్టాలి.
* అప్పుడు స్క్రీన్ రెడ్ కలర్‌లోకి మారుతుంది.
* మీ బ్లడ్ వెస్సెల్స్ నుంచి వచ్చే రెడ్, బ్లూ లైట్‌ ను ఏఐ ఆల్గరిథమ్ గుర్తిస్తుంది.
* మీ ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవెల్‌ను లెక్కిస్తుంది.
* 20 సెకన్లలో రిజల్ట్ తెలుస్తుంది.
* ఆ తర్వాత అనాలిసిస్ రిపోర్ట్ కనిపిస్తుంది.

సాధారణంగా SpO2 లెవెల్ 95-100 శాతం ఉండాలి. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి, ఛాతీ నొప్పి లాంటి సమస్యలు వస్తాయి. కోవిడ్ 19 తో పాటు ఆస్తమా, సీఓపీడీ, శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నవారు తరచూ SpO2 లెవెల్ చెక్ చేసుకోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు