కరోనా వైరస్ లక్షణాలు బైటకి కనిపించకపోవచ్చు…

మీలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? కరోనా వైరస్ లక్షణాలు కాదా? అయినా మరొకరికి ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది జాగ్రత్త అంటున్నారు పరిశోధకులు. ప్రస్తుతం నోవల్ చైనీస్ కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న సమయంలో మీలో కనిపించే లక్షణాలు కరోనా వైరస్ లక్షణాలు కాకపోయినా మీలో ఆ వైరస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు ప్రచురించిన ఓ నివేదిక వెల్లడించింది. ఈ విషయాన్ని పరిశోధక బృందం కూడా స్పష్టం చేసింది. చైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకిన కరోనా వైరస్ బారిన పడి ఇప్పటివరకూ 213 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9,700 మందికి ఈ వైరస్ సోకినట్టు కేసులు నమోదు అయ్యాయి.
న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన కేసు నివేదిక ప్రకారం.. ఆర్యోగంగా ఉన్న 33ఏళ్ల జర్మన్ వ్యాపారవేత్త ఉన్నట్టుండి ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఆమెలో జనవరి 24 నుంచి నోటిపూత, నొప్పులు, కండరాల నొప్పులు మొదలయ్యాయి. మరోసటి రోజు ఆయనకు 39 డిగ్రీల సెల్సియస్ వరకు జ్వరం వచ్చింది.
తెమడతో కూడిన దగ్గు ప్రారంభమైనట్టు జర్మనీలోని మునీచ్ LMU యూనివర్శిటీ ఆస్పత్రి రీసెర్చర్లు తెలిపారు. మరుసటి రోజు సాయంత్రానికి ఆయనలో వ్యాధి తీవ్రత తగ్గడంతో ఎప్పటిలానే తన వర్క్ లో మునిగిపోయినట్టు రిపోర్టు తెలిపింది. జనవరి 20, జనవరి 21న జర్మనీలోని మునీచ్ ప్రాంతంలో చైనీస్ వ్యాపార భాగస్వాములతో కలిసి ఆమె సమావేశమయ్యారు.
జనవరి 19 నుంచి జనవరి 22 మధ్యకాలంలో చైనీ వ్యాపార భాగస్వాములు జర్మనీని సందర్శించారు. అప్పటి నుంచి జర్మన్ వ్యాపారవేత్తలో ఈ అనారోగ్య లక్షణాలు ఆమెలో కనిపించాయి. రిపోర్టు ప్రకారం.. జర్మనీలో ఉన్న సమయలో ఆమెలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదు.
కానీ, చైనా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమెలో ఒక్కసారిగా ఈ లక్షణాలు వ్యాపించాయి. జనవరి 26న ఆమెకు పరీక్షలు జరపగా కరోనావైరస్ (2019-nCoV) పాజిటీవ్ అని వైద్యులు తేల్చేశారు. అంటే.. ఇన్ఫెక్షన్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా వారికి కూడా కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు.