వృద్దుల్లో కంటిచూపు పోవడానికి ప్రధాన కారణం మాంసాహారం
వయసు పైబడిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నో. ఒకటి, రెండు కాదు.. అనేక రకాల జబ్బులు చుట్టుముడతాయి. ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. కాళ్లు, చేతులు సహకరించవు.

వయసు పైబడిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నో. ఒకటి, రెండు కాదు.. అనేక రకాల జబ్బులు చుట్టుముడతాయి. ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. కాళ్లు, చేతులు సహకరించవు.
వయసు పైబడిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నో. ఒకటి, రెండు కాదు.. అనేక రకాల జబ్బులు చుట్టుముడతాయి. ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. కాళ్లు, చేతులు సహకరించవు. ఇక అన్నింటికన్నా ప్రధానమైన సమస్య కంటి చూపు తగ్గిపోవడం. వృద్దుల్లో క్రమంగా కంటి చూపు పోతుంది. అప్పటివరకు బాగా పని చేసిన కళ్లు.. ఒక్కసారిగా మబ్బులు కమ్మేస్తాయి. కంటి చూపు మందగిస్తుంది. ఏదీ స్పష్టంగా కనిపించదు. కళ్లద్దాలు పెట్టుకున్నా క్లారిటీ ఉండదు.
దీనిపై సైంటిస్టులు పరిశోధన చేశారు. పలు రకాల స్టడీలు చేసి అసలు కారణం ఏంటో కనుగొన్నారు. వృద్దుల్లో కంటి చూపు మందగించడానికి ప్రధాన కారణం డైట్ అని తేల్చారు. మనం తీసుకునే ఆహారమే సమస్యకు కారణమని కనుగొన్నారు. మాంసాహారం(రెడ్ మీట్), ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వృద్ధుల్లో కంటి చూపు పోతుందని పరిశోధనలో తేలింది.
అయితే ఇది కేవలం అమెరికన్ల విషయంలో తేలిన సర్వే. అమెరికాలో వృద్ధుల్లో కంటి చూపు పోవడానికి కారణాలు రెడ్ మీట్ (beef, horse meat, mutton, venison, boar, hare) ఫ్యాటీ ఫుడ్స్ అని పరిశోధకులు తెలిపారు. వెస్ట్రన్ డైట్స్ ఎక్కువగా తీసుకునే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు.
వయసు పైబడిన తర్వాత సెంట్రల్ విజన్ లేట్ స్టేజ్ ఏజ్ రిలేటెడ్ మాకులర్ డీజనరేషన్(AMD) డ్యామేజ్ జరుగుతుందన్నారు. కంటిలోని మాకులా(macula) డ్యామేజ్ అయినప్పుడు ఈ సమస్య వస్తుందన్నారు. మాకులాలో డ్రసన్(drusen) డిపాజిట్స్ ఎక్కువైనప్పుడు, రక్తస్రావం అయినప్పుడు అది డ్యామేజ్ అవుతుందన్నారు. జెనటిక్స్, స్మోకింగ్ కూడా కారణమే అని తేల్చారు.
కంటి చూపు పోవడానికి కారణాలు:
* 1300 మందిపై పరిశోధనలు
* 117 మందిలో ఎర్లీ ఏఎండీ, 27మందిలో లేట్ ఏఎండీ వచ్చినట్టు గుర్తించారు.
* అందరి డైట్స్ పై స్టడీ
* ఆహారాన్ని 29 వర్గాలుగా విభజించారు. వాటి క్వాలిటీని పరిశీలించారు.
* వెస్ట్రన్ డైట్ ఎక్కువగా తీసుకున్న వారిలో వయసుపైబడిన తర్వాత కంటి చూపు మందగించే పరిస్థితి కనిపించింది.
* డైట్ సరిగా లేకపోతే ఒబెసిటీ, కార్డో వాస్కులర్ సమస్యలు వస్తాయని అందరికి తెలుసు.
* కానీ.. కంటి చూపు సమస్యలు కూడా వస్తాయనే విషయం చాలామందికి తెలియదు.
మెరుగైన కంటి చూపు కోసం:
* మంచి డైట్ తీసుకోవాలి. కూరగాయలు తినాలి.
* డార్క్, లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవాలి.
* పండ్లు తీసుకోవాలి.
* ఆరోగ్యవంతమైన కంటి చూపు కోసం లూటిన్, జియాక్స్ తిన్ లాంటి పోషకాలు ఎక్కువగా ఉండే.. ఫుడ్ తీసుకోవాలి
* బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్ మాలజీలో ఈ స్టడీని పబ్లిష్ చేశారు.
* ఎపిడెమాలజీ, ఎన్విరాన్ మెంటల్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న అమీ మిలన్ నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది.
Also Read : వాట్సాప్ Groupలో సరికొత్త ఫీచర్.. Messages అదే డిలీట్ చేస్తుంది!