సోషల్ డిస్టెన్స్…మానసిక సమస్యలకు కారణం అవుతోంది. మరి తట్టుకోవడమెలా?

కరోనా వైరస్ నుంచి బయటపడేసేందుకు సామాజిక దూరం తప్పనిసరి అంటూ ఆంక్షలు విధిస్తున్నారు. ఈ సోషల్ డిస్టన్స్(సామాజిక దూరం) చాలా మంది ప్రవర్తనలో మార్పులు తీసుకొస్తుంది. మహమ్మారి ప్రభావంతో రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల కారణంగా క్వారంటైన్ లో ఉండిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసరం కానటువంటి వాటిని మూసే వేస్తున్నట్లు ఆర్డర్లు జారీచేసింది. దీంతో దేశవ్యాప్తంగా కాలేజీలు, ఆఫీసులు మొత్తం ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు అధికారులు. రెస్టారెంట్లు మూసి వేయడం, నర్సింగ్ హోమ్ లు విజిటర్స్ ను అనుమతించడం లేదు.
ఈ సామాజిక దూరం కరోనా వ్యాప్తిని అడ్డుకోవడమే కాకుండా, తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఇది సైకాలజికల్ గా ప్రభావం చూపించడంతో కొందరు తినడం కూడా మానేస్తున్నారట. యూనిఫార్మ్‌డ్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న డిజాస్టర్ మెంటల్ హెల్త్ ఎక్స్‌పర్ట్ జోషువా మోర్గాన్‌స్టీన్ ఇలా చెబుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా సామాజిక దూరం పాటించడం సైకాలజికల్ గా ప్రభావం చూపిస్తుంది. క్వారంటైన్ లో ఉంటున్న వారు, సమాజంలో తిరుగుతున్న వారిపై జరిపిన 24 స్టడీస్‌లో తేలిన విషయాలు కాస్త షాకింగ్‌గానే ఉన్నాయి.
SARS, H1N1 flu, Ebola లాంటి ఇతర ఇన్ఫెక్షన్ ల కారణంగా 2000వ సంవత్సరం నుంచి ఇటువంటి పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. క్వారంటైన్ లో ఉండే చాలా మంది ఒంటరివాళ్లలో స్వల్ప లేదా సుదీర్ఘ రుగ్మతలు కనిపించాయి. మానసిక ఒత్తిడి, ఇన్‌సోమ్నియా, మానసిక ఉద్వేగం లాంటి తేడాలు కనిపిస్తున్నాయి. 2760మంది క్వారంటైన్ లో ఉన్న వారిలో 938మంది సింగిల్సే. వారిలో సైకాలజికల్ డిస్ట్రెస్, మానసిక ఆరోగ్య సమస్యలు, ఉద్వేగం, ఆత్రుత వంటి లక్షణాలను 12శాతం క్వారంటైన్‌లోలేని వారితో పోల్చి చూశారు.
బీజింగ్ లో 2003 SARSప్రబలిన సమయంలో 549 హాస్పిటల్ వర్కర్లపై ప్రభావాలను గమనించారు. అందులో హై రిస్క్‌తో కూడిన ప్రమాదాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిని బట్టి క్వారంటైన్ లో ఉన్నవారు ఒంటరిగా కాలం గడిపేయకుండా సాధ్యమైనంత వరకూ ఫోన్ ద్వారా లేదా ఇతర పద్ధతులతోనైనా తెలిసిన వారితో కమ్యూనికేట్ అవడం మంచిది. అలా ఒంటితనంలో గడిపేస్తే మానసిక సమస్యలు తప్పవని నిపుణుల అంచనా.
ప్రస్తుత జనరేషన్లో ఇంటర్నెట్ ఆధారంగా బతికేస్తున్న వారు చాలా మంది. ఈ రకంగానైనా క్వారంటైన్ సమయంలో ఇతరులతో అభిప్రాయాలు పంచుకుంటూ ఒంటరితనానికి దూరంగా ఉండండి.