AC Health Problems : ఎక్కువ సమయం ఏసీలో గడుపుతున్నారా? అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం అధికమే!

ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయి. ఇందుకు డీహైడ్రేషన్ కూడా కారణం కావచ్చు. ఏసీ గదుల్లో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. AC గదిలోని తేమను గ్రహిస్తుంది. ఇది నిర్జలీకరణానికి కారణమవుతుంది.

AC Health Problems : ఎక్కువ సమయం ఏసీలో గడుపుతున్నారా? అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం అధికమే!

Air Conditioning

Updated On : September 10, 2022 / 12:43 PM IST

AC Health Problems : ఇళ్లు, కార్యాలయాలు, వాహనాల్లో వేడి వాతావరణాన్ని తట్టుకునేందుకు ఏసీలను ఆశ్రయిస్తుంటారు. కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు పనిసమయంతా ఏసీల్లో గడపాల్సి వస్తుంది. ఎక్కువ సేపు ఏసీల్లో ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎయిర్ కండిషన్ నుంచి వచ్చే చల్లదనం చర్మాన్ని దెబ్బతీస్తుంది. నిత్యం ఏసీలో ఉండేవారి చర్మం త్వరగా ముడతలు పడి, తేమను కోల్పోతుంది. కళ్లు దెబ్బతింటాయి. ఏసీలో ఉండటం వల్ల కళ్లు పొడిబారతాయి. ఏసీలో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి.

ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయి. ఇందుకు డీహైడ్రేషన్ కూడా కారణం కావచ్చు. ఏసీ గదుల్లో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. AC గదిలోని తేమను గ్రహిస్తుంది. ఇది నిర్జలీకరణానికి కారణమవుతుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఎక్కువ సమయం ఏసీ గదుల్లో గడపకపోవటమే మంచిది. ఏసీలో ఉండడం వల్ల చర్మంలో తేమ తగ్గి పొడిగా మారుతుంది. దీంతో చర్మంలో కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని వల్ల వృద్ధాప్య ఛాయలు వస్తాయి.

ఏసీలో ఉండడం వల్ల గొంతు పొడిబారడం, రినైటిస్, ముక్కు మూసుకుపోవడం వంటి సమస్యలు వస్తాయి. ముక్కు శ్లేష్మ పొర వాపునకు గురయ్యేలా చేస్తుంది. ఎయిర్ కండిషన్ ఫిల్టర్లు త్వరగా ధూళికణాలతో నిండిపోతాయి. అలాంటి గాలి పీల్చటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. కాంటాక్ట్ లెన్స్ వినియోగిస్తున్న వారికి , కంటి వ్యాధులున్న వారికి ఆస్తమా రోగులకు ఏసీ కారణంగా సమస్య పెరిగే అవకాశం ఉంది. అధిక సమయం ఏసీలో ఉండటం వల్ల అకస్మిక జలుబు, ముక్కు నుండి నీరు కారటం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.