Brain Cancer In Childrens: పిల్లల్లో పెరుగుతున్న మెదడు క్యాన్సర్.. లక్షణాలు ఇవే.. వెంటనే జాగ్రత్త పడండి
Brain Cancer In Childrens: మెదడులో ఉన్న కణాలు నియంత్రణ లేకుండా పెరిగి, మెదడుపై ప్రభావాన్ని చూపించడాన్ని బ్రెయిన్ క్యాన్సర్ అంటారు.

Brain Cancer In Children
ఇటీవల కాలంలో పిల్లలలో మెదడు క్యాన్సర్ కేసులు చాలా పెరుగుతున్నాయి. ఇది వారిలో శారీరకంగానే కాదు, మానసికంగా కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడే జాగ్రత్తపడటం వల్ల కొంత ఫలితం పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు. తల్లిదండ్రులు, పెద్దలు ఈ వ్యాధిని తొందరగా గుర్తించి వైద్య చికిత్స అందించగలిగితే, పిల్లల ప్రాణాలను కాపాడటం సాధ్యమవుతుంది.
అసలు మెదడు క్యాన్సర్ అంటే ఏమిటి?
మెదడులో ఉన్న కణాలు నియంత్రణ లేకుండా పెరిగి, మెదడుపై ప్రభావాన్ని చూపించడాన్ని బ్రెయిన్ క్యాన్సర్ అంటారు. ఇది ట్యూమర్ రూపంలో మొదలై క్రమంగా పెరిగి, మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. దాంతో తలలో విపరీతమైన నొప్పి ఏర్పడుతుంది.
పిల్లల్లో కనిపించే ముఖ్యమైన లక్షణాలు:
- చాలా తలనొప్పిగా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఉదయాన్నే అధికంగా వస్తుంది.
- తలనొప్పి అధికమై వాంతులు రావడం జరుగుతుంది.
- క్యాన్సర్ ప్రారంభదశలో పిల్లల చేతులు, కాళ్ల బలహీనంగా మారుతాయి.
- జ్ఞాపకశక్తి తగ్గుతుంది, దృష్టి మందగిస్తుంది, మాట్లాడటంలో తడబాటు ఉంటుంది.
- సడెన్‌గా బరువు తగ్గడం లేదా ఆకలిలేకపోవడం, నడవలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
నివారణ మరియు జాగ్రత్తలు:
- పిల్లల ఆరోగ్యంలో వచ్చే చిన్న చిన్న మార్పుల్ని గమనించండి.
- తరచూ తలనొప్పి, వాంతులు ఉంటే నిర్లక్ష్యం చేయకండి
- గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే మందులపై జాగ్రత్త వహించండి.
- అధిక రేడియేషన్, ప్లాస్టిక్ వాడకం తగ్గించండి
- మంచి ఆహారం, వ్యాయామం, నిద్రను అలవాటు చేసుకోండి
పిల్లల్లో మెదడు క్యాన్సర్ ప్రమాదకమైన వ్యాధి. కానీ సకాలంలో గుర్తిస్తే కంట్రోల్ చేయగళం. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే, ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఆరోగ్యంగా ఎదుగుతున్న బిడ్డల కోసం అందుబాటులో ఉండండి, గమనించండి.