Coocking oil: ఈ 8 రకాల నూనెలు చాలా డేంజర్.. క్యాన్సర్ ప్రమాదం.. అధ్యాయనాల్లో షాకింగ్ నిజాలు

Coocking oil: ఈ 8 రకాల నూనెలు చాలా డేంజర్.. క్యాన్సర్ ప్రమాదం.. అధ్యాయనాల్లో షాకింగ్ నిజాలు

These 8 types of oils are very dangerous

Updated On : June 3, 2025 / 12:42 PM IST

మనం తినే వంటకాలల్లో నూనె ప్రధానం. కానీ, అదే నూనె విషంగా మారితే.. మనిషి జీవితాన్ని మధ్యలోనే హరిస్తే.. క్యాన్సర్, గుండె వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమైతే.. పరిస్థితి ఏంటి? తాజాగా జరిగిన అధ్యాయనాల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి నూనెల వాడకం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ మధ్య కాలంలో వంటల్లో వాడుతున్న కొన్ని రకాల నూనెల గురించి అనేకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వాడకంలో ఉన్న దాదాపు 8 రకాల నూనెలు మనిషి ఆరోగ్యానికి హానికరం అని, ప్రమాదకరం అని కొన్ని అధ్యాయనాలు చెప్తున్నాయి.

వాటిలో సన్‌ ఫ్లవర్, రైస్ బ్రాన్, సోయ, కనోలా, కార్న్, కాటన్‌సీడ్, గ్రేప్ సీడ్, సాఫ్లవర్ వంటి ప్రముఖ ఆయిల్స్ ఉన్నాయి. దాదాపు 60 శాతం మంది ఎక్కువగా ఈ నూనెలనే వాడుతున్నారు. వారికి తెలియకుండానే వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నూనెలు గుండె జబ్బులకు, క్యాన్సర్‌, టైప్ 2 డయాబెటీస్ కి కారణమవుతున్నాయట. మరీ ముఖ్యంగా వీటి ప్రభావం యువతపై ఎక్కువగా ఉందని తెలిసింది. ఈ మధ్య కాలంలో హఠాత్తుగా చనిపోతున్న వారి సంఖ్య చాలా పెరిగింది. దీనికి సంబందించిన ఆర్టికల్స్ గట్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

బయోయాక్టివ్ లిపిడ్లు అధికంగా ఉన్న 80 మంది క్యాన్సర్ రోగులపై ఈ పరిశోధనలు జరిపారు. 30 నుండి 85 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తుల క్యానర్ కణితి నమూనాలను పరిశీలించారు. వాటికి ప్రధాన కారణం విత్తన నూనెలే అని తెలిసింది. విత్తన నూనెలు విచ్ఛిన్నం కావడం వల్లే వారిలో బయోయాక్టివ్ లిపిడ్లు పెరిగాయని, అది క్రమంగా ప్రమాదకరమైన క్యాన్సర్ కణితిలుగా మారాయని పరిశోధకులు గుర్తించారు. ఈ నూనెలో ఒమేగా-6, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది

మరి వంట కోసం ఎలాంటి నూనె వాడటం మంచిది?

ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఆలివ్ ఆయిల్ లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి తేలికపాటి నూనెను ఎంచుకోవడం మంచిది. కొన్ని రకాల వేపుళ్ళ కోసం వేరుశెనగ, సోయాబీన్ నూనెలు వాడవచ్చు. ఇక వంట కోసం ఆలివ్ నూనె, మంచి రుచి, వాసన కావాలంటే నువ్వులు, కొబ్బరి నూనె ఉపయోగించవచ్చు. ఇవి త్వరగా జీర్ణమై రక్తంలో సులభంగా కలిసిపోతుంది. కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం తగ్గుతుంది.