కోవిడ్ వ్యాక్సిన్లలో డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్.. రెండో డోస్ తీసుకోవాలా వద్దా? ఆందోళనలో ఫౌసీ

One Coronavirus Vaccine Side Effect : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని నిర్మూలించే కరోనా వ్యాక్సిన్లు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా కరోనా వ్యాక్సిన్ల వ్యాక్సినేషన్ మొదలైంది. అయితే ఈ కరోనా వ్యాక్సిన్లలో డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అంటున్నారు. కరోనా వ్యాక్సినల్లో సైడ్ ఎఫెక్ట్స్ కారణం ఏంటో తెలియలేదు. గతవారమే డాక్టర్ ఆంథోనీ ఫౌసీ సహా దాదాపు 2 మిలియన్ల మంది అమెరికన్లు కరోనా వ్యాక్సిన్ల తొలి మోతాదు అందుకున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక వారిలో ఒకే ఒక సైడ్ ఎఫెక్ట్ అందోళనకు గురిచేస్తోంది. వ్యాక్సిన్ వేసిన 10 గంటల్లో సైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని ఫౌసీ పేర్కొన్నారు.
వ్యాక్సిన్ వేసిన చోట చేతిపై వాపు, తీవ్రమైన నొప్పిగా ఉందని అంటున్నారు. అయితే టీకా వేసిన 24 గంటల తర్వాత నొప్పి తగ్గినట్టు ఫౌసీ తెలిపారు. ఈ ఒక్క సైడ్ ఎఫెక్ట్ మినహా ఇతర ఎలాంటి దుష్ప్రభావాలను అనుభవించలేదని ఫౌసీ చెప్పుకొచ్చారు. ఫైజర్, మోడెర్నా కరోనా వ్యాక్సిన్లలో అసాధారణ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడంపై ఫౌసీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ సమయంలో కూడా ఈ వ్యాక్సిన్లలో ఎలాంటి ప్రాణాంతక సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తలేదని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ పొందిన వాలంటీర్లలో ఎవరిలోనూ తలనొప్పి, కండరాల నొప్పి మాత్రమే కనిపించాయని, అవి కూడా 24 గంటల్లోనే తగ్గిపోయాయని తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ప్రతిఒక్కరికి టీకాను రెండు మోతాదులలో అందిస్తున్నారు. ఫౌసీ సహా మిలియన్ల మంది అమెరికన్లు మొదటి డోస్ అందుకున్నారు.
రెండు వారాల వ్యవధిలో రెండో టీకా డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి డోస్ సమయంలో తలెత్తిన తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ గురించి ఫౌసీ ఆందోళన వ్యక్తం చేశారు. రెండో డోస్ తీసుకోవాలా? వద్దా అనే సంశయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న చాలామందిలో తీవ్రమైన అలర్జీ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. వారిలో ఎవరికైనా గతంలో అలర్జీ వంటి సమస్యలు ఉన్నాయో లేదా అనేది తేలాల్సి ఉంది. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు కరోనాను నివారించగల సామర్థ్యం ఉందని, 95శాతం ప్రభావంతంగా పనిచేస్తాయని తేలింది. అయినప్పటికీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా దీనిపై లోతుగా అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.