అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు 6 రకాల పండ్లను డైట్ లో చేర్చుకోవటం మంచిది!

రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ తో పని ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేసే అద్భుత గుణాలు కలిగి ఉంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండెకి హాని కలిగించే అనేక వ్యాధులను దరిచేరకుండా చూస్తుంది.

అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు 6 రకాల పండ్లను డైట్ లో చేర్చుకోవటం మంచిది!

cholesterol problem should include 5 types of fruits in their diet

Updated On : September 9, 2022 / 2:13 PM IST

అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వాళ్ళ సంఖ్య రోజూ రోజుకి పెరుగుతుంది. నిశ్చల జీవనశైలి, చెడు ఆహర అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్‌ సమస్య పెరుగుతోంది. శరీర పనితీరుకు కొలెస్ట్రాల్ అవసరం. కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు ఉంటాయి. అది చెడు కొలెస్ట్రాల్‌ అయినా, మంచి కొలెస్ట్రాల్‌ అయినా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్‌ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డిఎల్‌ అంటారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగితే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గుండె సంబంధిత జబ్బులకి మూల కారణం అధిక కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఎక్కువైతే పొట్ట, పిరుదులు, నడుము భాగంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరగటానికి కారణమౌతుంది.

అధిక కొలెస్ట్రాల్ సమస్యతో సతమతమవుతున్న వాళ్ళు ఐదు రకాల పండ్లను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవచ్చు.

సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మ, ద్రాక్ష పండ్లు అన్నీ సిట్రస్ పండ్ల జాబితలొకే వస్తాయి. వీటిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలని అదుపులో ఉంచుతుంది. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. చర్మం, జుట్టు సంరక్షణకు కూడా ఇవి సహాయపడతాయి.

బొప్పాయి: బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా రక్తపోటుని నియంత్రించి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే రోజూ పచ్చి బొప్పాయిని ఏదో ఒక రూపంలో ఆహారంలో మిళితం చేసుకోండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె పోటు కలిగే అవకాశాన్ని తగ్గిస్తాయి. పచ్చి బొప్పాయిలో కూడా మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. బి, సి, ఇ విటమిన్లు నిండుగా ఉంటాయి. పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం కూడా లభిస్తాయి.

టమాటా: టమోటాలో విటమిన్స్ ఎ, బి, సి, కె ఉంటాయి. ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండెకి మేలు చేస్తుంది.

యాపిల్: రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ తో పని ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేసే అద్భుత గుణాలు కలిగి ఉంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండెకి హాని కలిగించే అనేక వ్యాధులను దరిచేరకుండా చూస్తుంది.

అవకాడో: కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి అవకాడో తినమని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. గుండెని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు స్ట్రోక్ ముప్పును తగ్గిస్తుంది. అవకాడోలో 96 కేలరీలు, 6 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వులు, 4 గ్రాముల ఫైబర్ లభిస్తాయి.

క్యారెట్ ; కూరగాయల్లో క్యారెట్ ఎక్కువగా తీసుకుంటే గుండెకి చాలా మేలు చేస్తుంది. క్యారెట్ తినడం వల్ల రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. క్యారెట్ ను జ్యూస్ గా చేసుకుని తాగొచ్చు లేదంటే పచ్చి వాటిని తీసుకోవచ్చు.