Breathing Exercises Benefits : బ్రీతింగ్ ఎక్సర్‌సైజులతో కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలివే.. తప్పక పాటించండి!

Breathing Exercises Benefits : ఆందోళన, ఒత్తిడి లేదా ఎలాంటి మానసిక రుగ్మతలైనా సరే.. ఇతర అనారోగ్య సమస్యలన్నా సులభంగా బయటపడాలంటే బ్రీతింగ్ ఎక్సర్ సైజులను చేయడం అలవాటు చేసుకోవాలి.

Breathing Exercises Benefits : బ్రీతింగ్ ఎక్సర్‌సైజులతో కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలివే.. తప్పక పాటించండి!

Top 7 Health benefits of performing breathing exercises

Breathing Exercises Benefits : శ్వాస తీసుకోవడం.. వదలడం అనేది నిరంతర ప్రక్రియ.. అయితే, ప్రస్తుత బిజీలైఫ్‌లో ప్రతిఒక్కరూ తీవ్ర ఒత్తిడి, పనిభారంతో ఇబ్బందిపడుతున్నారు. కొంచెం కూడా విరామం లేకుండా అదేపనిగా కూర్చోవడం వంటి పనులతో తీవ్ర అలసటకు లోనవుతున్నారు. దీని కారణంగా చాలామంది అనేక అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు.

ఎలాంటి మందులు లేకుండా కేవలం బ్రీతింగ్ ఎక్సరసైజులతో సులభంగా అన్ని మానసిక రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. ప్రాణాంతక వ్యాధులు దరిచేకుండా జాగ్రత్త పడవచ్చు. సాధారణంగా మెదడు శ్వాసకోశ కేంద్రం శ్వాసను నియంత్రిస్తుంది. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు సంభవించే ‘ఫైట్-ఆర్-ఫ్లైట్ స్పందన’ మన శ్వాస విధానాలు, రేట్లలో మార్పులకు కారణమవుతుంది. అదృష్టవశాత్తూ, ఈ సమస్యల నుంచి బయటపడేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.

Read Also : Health Effects of Tea: టీ తాగుతున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసా?

శాస్త్రీయ పరిశోధన ప్రకారం.. శ్వాసపరమైన వ్యాయామాలు ఒత్తిడితో సంబంధం ఉన్న రుగ్మతలను తగ్గించడంలో సాయపడతాయి. శ్వాస నియంత్రణతో ధ్యానం, యోగా వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. డీప్ బ్రీత్ అనేది విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడిని ఎదుర్కోవటానికి అద్భుతంగా సాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాదు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. శ్వాస వ్యాయామాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది :
శ్వాసపరమైన వ్యాయామాలతో కలిగే ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి.. ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గడం.. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివ్ కావడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. మీ శరీరం, మనస్సును శాంతపరచడానికి ఈ బ్రీతింగ్ ఎక్సరసైజులు సమర్థవంతంగా ఉపయోగపడతాయి.

2. ఊపిరితిత్తుల పనితీరు :
శ్వాస వ్యాయామాలతో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. శరీరానికి ఆక్సిజన్ పంపే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడతాయి. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తుంది.

3. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది :
విశ్రాంతి, ఒత్తిడిని తగ్గించడంతో రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో బ్రీతింగ్ ఎక్సరసైజులు సమర్థవంతంగా పనిచేస్తాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4. రోగనిరోధకశక్తి మెరుగుపడటం :
బ్రీతింగ్ ఎక్సరసైజులతో శరీరంలో మంటను తగ్గించుకోవచ్చు. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుకోవచ్చు. రోగనిరోధక ప్రతిస్పందనలో కీలక పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ వ్యాయామాలు అద్భుతంగా పనిచేస్తాయి.

5. మెరుగైన జీర్ణక్రియ :
శ్వాస పీల్చడం వదలడం వంటి వ్యాయామాలతో పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపించడంలో సాయపడతాయి. విశ్రాంతితో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. తద్వారా గట్ (పేగుల) ఆరోగ్యానికి సాయపడతుంది.

6. కండరాల ఒత్తిడి :
శ్వాస ద్వారా చేసే వ్యాయామాలతో కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. శరీరంలో ఒత్తిడిని తగ్గించడానికి సాయపడుతుంది. దీర్ఘకాలిక నొప్పి లేదా కండరాల పట్టేయడం వంటి సమస్యలతో బాధపడేవారికి అద్భుత ప్రయోజనమని చెప్పవచ్చు.

7. నిద్ర నాణ్యత :
తగినంత విశ్రాంతితో పాటు ఒత్తిడిని తగ్గించడం ద్వారా శ్వాసపరమైన వ్యాయామాలు నిద్రనాణ్యతను మెరుగుపరచడంలో సాయపడతాయి. డీప్ బ్రీతింగ్ వ్యాయామాలను నిద్రవేళకు ముందు మనస్సు, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడంలో సాయపడతాయి. మరింత ప్రశాంతమైన రాత్రి నిద్రకు ఉపకరిస్తుంది. ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి ప్రతిరోజూ శ్వాసపరమైన వ్యాయామాలను చేయడం అలవాటు చేసుకోవాలని ఫిట్ నెస్ నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Kiwis Health Benefits : కివీస్ పండ్లను తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే!