vitamin D , C supplements వాడితే కరోనా వచ్చే అవకాశాలు తగ్గుతాయి

తాను vitamin D , C supplements వాడుతున్నానని, దాని వల్ల వైరస్ వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని అంటున్నారు అమెరికా ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ ఫాసీ. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే విటమిన్ డి, సిలను వాడాలని ఆయన అన్నారు.
ఈ సిఫార్స్ వెనుక సైన్స్, స్టడీస్ ఉన్నాయి. విటమిన్‌ల లోపముంటే కరోనా ధాటిని తట్టుకోవడం చాలా కష్టం. అలాగని కనిపించిన ప్రతి విటమన్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వల్ల లాభం ఉండబోదని తేల్చేశారు.
తాను అవసరం మేరకు విటమిన్ డిని వాడతానని, vitamin C మంచి antioxidant కాబట్టి తీసుకొంటానని, మిగిలిన విటమిన్‌ల అవసరం ఉండబోదని అన్నారు.
డా.ఫాసీ రికమండేషన్ వైరల్ అవుతోంది. vitamin D వాడితే చాలావరకు కరోనా నుంచి తప్పించుకోవచ్చన్న సంగతి ఇంతకుముందే రుజువైంది. దానికి తోడు vitamin C ని వాడితే మరింతగా ప్రయోజమని డా. ఫాసీ తేల్చేశారు.