మెస్సీ జట్టుపై రేవంత్‌ రెడ్డి టీమ్‌ ఘనవిజయం.. తెలంగాణ సీఎం ఎలా ఆడారో చూడండి..

ఈ మ్యాచ్‌ను రాహుల్‌ గాంధీ కూడా చూశారు. అలాగే, ప్రియాంక గాంధీ కుమారుడు, కుమార్తె కూడా స్టేడియానికి వచ్చారు.

మెస్సీ జట్టుపై రేవంత్‌ రెడ్డి టీమ్‌ ఘనవిజయం.. తెలంగాణ సీఎం ఎలా ఆడారో చూడండి..

Updated On : December 13, 2025 / 9:45 PM IST

Lionel Messi: హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జట్ల మధ్య ఇవాళ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్ జరిగింది.

మెస్సీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా నిర్వహించిన ఈ మ్యాచ్‌లో మెస్సీ టీమ్‌పై సింగరేణి ఆర్‌ఆర్‌ టీమ్‌ 3-0 గోల్స్‌తో గెలిచింది. ఆర్‌ఆర్‌ టీమ్ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి ఆడి ఓ గోల్‌ కొట్టారు. ఇందులో మెస్సీ, రేవంత్ రెడ్డి ఆడింది 5 నిమిషాలపాటే. (Lionel Messi)

అనంతరం, ఇరు జట్లకు మెస్సీ పతకాలు అందజేశారు. ఇక్కడకు వచ్చి తెలుగు వారిని కలవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడి వారు చూపించిన అభిమానం ఎంతో శక్తినిచ్చిందని చెప్పారు.

కాగా, మ్యాచ్‌కి ముందు ఇరు టీమ్‌లతో మెస్సీ, రేవంత్‌ రెడ్డి ఫొటోలు దిగారు. ఈ మ్యాచ్‌ను రాహుల్‌ గాంధీ కూడా చూశారు. అలాగే, ప్రియాంక గాంధీ కుమారుడు, కుమార్తె కూడా స్టేడియానికి వచ్చారు.