పిల్లలను కరోనా వైరస్ నుంచి ఎలా రక్షించుకోవాలి.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు!

  • Publish Date - March 4, 2020 / 12:28 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. చైనా నుంచి మొదలై ప్రపంచ దేశాలకు పాకుతుంది. ఇప్పుడు భారత్ లోకి కరోనా వైరస్ ప్రవేశించింది. ఇదివరకే 70 దేశాల్లోని వేలాది మందికి కరోనా వైరస్ సోకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 92,819 కేసులు నమోదు కాగా, 3,164 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు, భారత్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 28కి చేరింది. కరోనా విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కానీ, చాలా తక్కువ మంది పిల్లలు వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే పిల్లలలో కరోనా మరణాలు చాలా అరుదుగా చెప్పవచ్చు. కరోనా వైరస్ కారణంగా పిల్లలు ఎలా ప్రభావితమవుతారనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

పిల్లలలో SARS-CoV,  MERS-CoV వ్యాప్తి సాధారణంగా ఊహించిన దానికంటే తక్కువగా నమోదైంది. ఉదాహరణకు, సౌదీ అరేబియాలో మెర్స్ కరోనావైరస్ కేసులలో 3.4 శాతం పిల్లలలో ఉన్నాయి. ఇక్కడ జనాభాలో 15 శాతం మంది 19 ఏళ్లలోపువారే ఉన్నారు. SARSలో ఇదే విధంగా కనిపించింది. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో సంక్రమణ రేటు వృద్ధాప్య సమూహాల కంటే చాలా తక్కువగా ఉందని నిపుణులు గుర్తించారు. COVID-19 మొట్టమొదటిసారిగా చైనాలోని వుహాన్‌లో 2019 డిసెంబర్‌లో బయటకు వచ్చింది. ఇప్పటికే SARS-CoV, MERS-CoV వైరస్ కలిపి కంటే ఎక్కువ మరణాలకు కరోనా వైరస్ కారణమైంది.

పిల్లల్లో వైరస్ ప్రభావం ఎంతంటే?
పిల్లలలో నమోదైన COVID-19 కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. చైనా నుండి 44,000 కంటే ఎక్కువ ధృవీకరించబడిన కేసులలో 416 (1 శాతం కంటే తక్కువ) మాత్రమే 9 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు గల చిన్నారులు ఉన్నారు. ఈ వయస్సులో పిల్లల్లో ఎవరూ మరణించలేదు. ఆస్ట్రేలియాలో.. ఇప్పటివరకు ఒక పిల్లవాడు మాత్రమే COVID-19 వ్యాపించినట్టు నిర్ధారించారు.

* తక్కువ సంఖ్యలో పిల్లలు వైరస్ బారిన పడుతున్నారు
* తక్కువ సంఖ్యలో పిల్లలకు సోకవచ్చు.
* సోకిన పిల్లల్లో తీవ్రమైన లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు .
* పెద్ద సంఖ్యలో పిల్లలు అనారోగ్యానికి గురికాకపోవడం మంచి విషయమే.

పిల్లలు వైరస్ సోకినప్పటికీ ఇంకా తేలికపాటి లక్షణాలు ఉంటే.. వారిపై COVID-19 వైరస్ సోకే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. పిల్లలు మొబైల్ తో ఆడుతుంటారు. ఇలా కూడా వైరస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. స్కూల్లో చదివే వయస్సు ఉన్న పిల్లలు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా నిరోధించాల్సిన అవసరం ఉంది. COVID-19 వ్యాక్సిన్ లేనప్పుడు, పిల్లల్లో ఈ ప్రాణాంతక వైరస్ సోకకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యగా పాఠశాల మూసివేయాల్సి ఉంటుంది.

పిల్లలకు ఏ లక్షణాలు వస్తాయి?
* వైరస్ సోకిన పిల్లలకు తరచుగా దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం, విరేచనాలు, తలనొప్పి ఉన్నట్లు చైనా వైద్యులు నివేదిస్తున్నారు. పిల్లల్లో సగానికి తక్కువగా జ్వరం వస్తుంది. కొంతమందిలో లక్షణాలు లేవు.
* చైనాలో COVID-19 సోకిన పిల్లలు కౌమారదశలో ఎక్కువ మందికి తేలికపాటి ఇన్ఫెక్షన్లు వచ్చాయి.
* ఒకటి నుండి రెండు వారాలలో పిల్లలు తిరిగి కోలుకున్నారు.
* తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు గురయ్యే శిశువులకు కూడా తేలికపాటి ఇన్ఫెక్షన్లు వ్యాపించాయి.

మీ ఫ్యామిలీని వైరస్ నుంచి ఎలా కాపాడుకోవచ్చు?
– COVID-19 సోకిన వ్యక్తి దగ్గు లేదా తుమ్ము ఉన్నప్పుడు ఉత్పన్నమయ్యే బిందువుల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది.
– సోకిన వ్యక్తి తుమ్మిన వస్తువులు లేదా ఉపరితలాలను తాకడం, నోరు, ముక్కు లేదా ముఖాన్ని తాకరాదు.
– నివారించడానికి మీ చేతులను సబ్బు నీటితో కడగడం, మీ మోచేతుల వరకు శుభ్రంగా కడుక్కోవాలి.
– దగ్గు, తుమ్మితే మీ నోటికి అడ్డంగా ఏదైనా ఉంచుకోవడం ద్వారా నివారించవచ్చు.
– వైరస్ సోకినట్టు అనుమానంగా లేదా అనారోగ్యంగా అనిపిస్తే వైద్యులను సంప్రదించండి.
– వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వ్యాపించకుండా నిరోధించడానికి మాత్రమే మాస్క్‌లు అవసరం.
– చిన్న పిల్లలను ఎక్కువగా సేపు మాస్క్ ధరించేలా చేయడం దాదాపు అసాధ్యమే.

పిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి :
* పిల్లల్ని స్కూళ్లకు పంపే సమయంలో వారి చేతులకు హ్యాండ్ శానిటైజర్ రాసి పంపండి.
* పిల్లల ముఖాలకు మాస్కులు లేదా కర్చీప్‌ల వంటివి ధరించేలా చూసుకోవాలి.
* కళ్లు, ముక్కు, నోటి దగ్గరకు చేతులు, వేళ్లను పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* పిల్లల్ని స్కూల్లో ఎక్కువ సార్లు చేతుల్ని బాగా శుభ్రం చేసుకోమని సూచించండి.
* స్కూల్లో ఎవరైనా పిల్లలకు దగ్గు, జలుబు ఉంటే.. స్కూల్ టీచర్లకు చెప్పమని చెప్పండి
* టిష్యూ పేపర్ నోటికి అడ్డు పెట్టుకొని మాత్రమే దగ్గడం, తుమ్మడం చేయాలి. అది పారేయాలి.
* టిఫిన్ బాక్సుల్లో C విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారం, పుల్లటి ఫ్రూట్స్ ఇచ్చి పంపండి.
* స్కూళ్ల నుంచీ పిల్లలు ఇంటికి వచ్చాక వారికి స్నానం చేయించాలి. విడిచిన బట్టల్ని అప్పుడే ఉతకాలి.
– తక్కువ మందిలో పిల్లలు ఆడుకునేలా జాగ్రత్తలు తీసుకోండి.
* స్కూల్ నుంచి ఇంటికి రాగానే బయట ఆటలు ఆడనివ్వొద్దు.
* పిల్లల్లో కరోనా లక్షణాల కనిపిస్తే.. వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
* పిల్లలకు ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లు ఇస్తూ ఉండాలి.