10th క్లాస్ ఇంగ్లీష్ పేపర్ -2 పబ్లిక్ ఎగ్జామ్ వాయిదా

  • Published By: veegamteam ,Published On : March 5, 2019 / 11:15 AM IST
10th క్లాస్ ఇంగ్లీష్ పేపర్ -2 పబ్లిక్ ఎగ్జామ్ వాయిదా

Updated On : March 5, 2019 / 11:15 AM IST

2019, మార్చి 22వ తేదీ జరగనున్న పదో తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ పేపర్-2 వాయిదా పడింది. దీనికి సంబంధించి ప్రకటన చేసింది SSC బోర్డ్. ఈ పరీక్షను తిరిగి ఏప్రిల్ 3వ తేదీ నిర్వహించనున్నట్లు నోట్ విడుదల చేసింది. దీనికి కారణం ఎమ్మెల్సీ ఎన్నికలు. మార్చి 22న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈ పరీక్షను వాయిదా వేసినట్లుగా సమాచారం.

మార్చి 16న లాంగ్వేజ్ పేపర్ తో ప్రారంభం అయ్యి.. ఏప్రిల్ 2న ముగియనున్నట్లు ముందుగా షెడ్యూల్ ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న క్రమంలో వాయిదా పడిన ఇంగ్లీష్ పేపర్-2ని.. ఏప్రిల్ 3వ తేదీన నిర్వహిస్తూ షెడ్యూల్ మార్చారు. 
Also Read : ప్రభాస్ ను కొట్టలేదు.. జస్ట్ తాకింది అంతే..!