భజరంగ్‌దళ్ కార్యకర్తలు అరెస్ట్

ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ సమీపంలో హనుమాన్ టెంపుల్ నుంచి ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించిన భజరంగ్‌దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన 60 మంది భజరంగ్‌దళ్ కార్యకర్తలను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
ఇక పంజాగుట్టలోని బంగారం దుకాణాల వద్ద కూడా భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బంగారం కొనుగోళ్లపై ఆఫర్లు ప్రకటించి.. పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని ఆందోళనకారులు మండిపడ్డారు. బంగారం షాపుల వద్ద ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమికుల దినోత్సవం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నిస్తుండగా ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు.