11న సెలవు ప్రకటించని సంస్థలపై చర్యలు : దాన కిషోర్
లోక్‌సభ ఎన్నికలు జరిగే 11వ తేదీన సెలవు ప్రకటించని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిషోర్ హెచ్చరించారు.

లోక్‌సభ ఎన్నికలు జరిగే 11వ తేదీన సెలవు ప్రకటించని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిషోర్ హెచ్చరించారు.
హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలు జరిగే 11వ తేదీన సెలవు ప్రకటించని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిషోర్ హెచ్చరించారు. ఈమేరకు ఏప్రిల్ 9 మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజున వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సంస్థలపై ప్రజాప్రాతినిధ్యచట్టం 1951 సెక్షన్ 135(బి)తో పాటు కార్మిక చట్టాలను అనుసరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికీ కొన్ని సంస్థలు సెలవు ప్రకటించలేదని ఫిర్యాదుల ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగులను ఓటింగ్‌లో పాల్గొనకుండా చేయడం నిబంధనలకు అతిక్రమించడమేనని వెల్లడించారు.
Read Also : పోల్ జర్నీ : టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ