పెళ్లి రోజునే : అమృతకు అబ్బాయి పుట్టాడు.. అచ్చం ప్రణయ్ లాగే..

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 10:39 AM IST
పెళ్లి రోజునే : అమృతకు అబ్బాయి పుట్టాడు.. అచ్చం ప్రణయ్ లాగే..

Updated On : January 30, 2019 / 10:39 AM IST

ప్రణయ్ – అమృత స్టోరీ అందరికీ తెలిసిందే. వీరి పెళ్లి రోజునే అమృత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 2019, జనవరి 30వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది అమృత. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. పెళ్లి రోజునే అబ్బాయి పుట్టటం.. ప్రణయ్ మళ్లీ పుట్టాడని కుటుంబ సభ్యులు ఆనందంతో ఉన్నారని ప్రణయ్ కుటుంబ సభ్యులు ప్రకటించారు. వారం క్రితం అమృతకు అబ్బాయి పుట్టాడు అంటూ వార్తలు వచ్చాయి.. ఆ వార్త తప్పు అని ప్రకటించింది అమృత. ఏ విషయం అయినా స్వయంగా వెల్లడిస్తాను అని స్పష్టం చేసింది. జనవరి 30వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ఆస్పత్రిలో అమృతకు అబ్బాయి పుట్టాడని ప్రణయ్ కుటుంబ సభ్యులు స్వయంగా ప్రకటించారు. అబ్బాయి పుట్టాడు… అచ్చం ప్రణయ్ లాగే ఉన్నాడని అంటున్నారు.

 

ప్రణయ్ హత్య జరిగిన నాటికి అమృత ఐదు నెలల గర్భిణి. మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని వస్తుండగా అమృత తండ్రి పంపించిన హంతకులు.. అత్యంత దారుణంగా చంపేశారు. పోలీస్ విచారణలోనూ ఇదే విషయాన్ని తెలిపాడు మారుతీరావు. ఆ తర్వాత ప్రాణహాని ఉందంటూ అమృత పోలీస్ సెక్యూరిటీ కోరింది. అప్పటి నుంచి ఆమె ఇంటి దగ్గర ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. 

 

ప్రణయ్ మళ్లీ పుడతాడు అంటూ అమృత చాలా సందర్భాల్లో.. ఇంటర్వ్యూలు చెబుతూ వచ్చింది. అన్నట్లుగానే మగబిడ్డకు జన్మనివ్వటంతో ప్రణయ్ ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. పుట్టిన బిడ్డలో ప్రణయ్ ను చూసుకుంటున్నామని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. 

See also : తీపి గురుతులు : పెళ్లి రోజును గుర్తు చేసుకున్న అమృత ప్రణయ్