కరోనా కలకలం : గాంధీ ఆస్పత్రిలో చేరిన మరో అనుమానితురాలు

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. గాంధీ ఆస్పత్రికి వస్తున్న అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో కరోనా వైరస్ అనుమానితురాలు ఆస్పత్రికి వచ్చింది.

  • Published By: veegamteam ,Published On : February 6, 2020 / 01:39 PM IST
కరోనా కలకలం : గాంధీ ఆస్పత్రిలో చేరిన మరో అనుమానితురాలు

Updated On : February 6, 2020 / 1:39 PM IST

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. గాంధీ ఆస్పత్రికి వస్తున్న అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో కరోనా వైరస్ అనుమానితురాలు ఆస్పత్రికి వచ్చింది.

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. గాంధీ ఆస్పత్రికి వస్తున్న అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో కరోనా వైరస్ అనుమానితురాలు ఆస్పత్రికి వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అనుమానితురాలు బస్ లో ప్రయాణించి గాంధీ ఆస్పత్రికి చేరుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పని చేసేస్తున్న డాక్టర్ గా అనుమానిస్తున్నారు. కరోనా వైరస్ పై అవగాహన లేకుండా బస్ లో ప్రయాణం చేయడంపై ఆమెపై గాంధీ ఆస్పత్రి డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కరోనాకు సంబంధించి ఉదయం నుంచి అనుమానితులు ఒక్కొక్కరిగా ఆస్పత్రిలో చేరుతున్నారు. కొద్ది సేపటి క్రితమే కరోనా వైరస్ అనుమానితులు ఆస్పత్రికి వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పని చేసే డాక్టర్ గా అనుమానిస్తున్నారు. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో ఆమె ఐసోలేషన్ వార్డులో చేరేందుకు గాంధీ ఆస్పత్రికి వచ్చారు. తాను వస్తున్నట్లుగా ముందుగానే ఆస్పత్రి వర్గాలకు సమాచారం ఇచ్చారు. 

అయితే ఆమె క్యాబ్ లో వస్తుందనుకుంటే, శంషాబాద్ నుంచి బస్సులో ప్రయాణించి ఆస్పత్రికి వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న గాంధీ ఆస్పత్రి నోడల్ ఆఫీసర్, వైద్య బృందం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే కరోనా అనేది ఏ విధంగా వ్యాపిస్తుందో తెలియని విషయం. ఒకవేళ కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగి వుంటే కనుక చాలా మంది బాధపడే ప్రమాదం ఉంటుందని, ఆమె నుంచి చాలా మందికి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమానితురాలి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని, ఐసోలేషన్ వార్డులో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

కరోనా ప్రపంచ దేశాలను వణకిస్తోంది. చైనాను కరోనా వైరస్‌ పట్టిపీడిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ అనుమానిత కేసులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ ను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. బుధవారం 9 మంది అనుమానితులు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేరారు. గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు, ఫీవర్ ఆస్పత్రిలో నలుగురు అనుమానితులు చేరారు. తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి వరకు 25 అనుమానిత కేసులు నమోదు అయ్యాయి. అయితే 25 మందిలో ఎరికి కూడా కరోనా వైరస్ లేదని నిర్ధారణ అయింది. 

అనుమానితుల్లో కరోనా వైరస్ లక్షణాలున్నాయని..చైనా నుంచి తెలంగాణకు వచ్చిన ప్రయాణికుల్లో 9 మంది ఆస్పత్రుల్లో చేరారు. గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు, ఫీవర్ ఆస్పత్రిలో నలుగురు చేరారు. 34 మంది అనుమానితులు గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మందికి మాత్రం కరోనాకు సంబంధించి ఎటువంటి లక్షణాలు నిర్ధారణ కాలేదు. అయితే అందులో కొంతమందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ గా ఉన్నట్లు తేలినవారికి మాత్రం ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు 28 మందికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీటికి సంబంధించి నిన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆరోగ్య శాఖ..ఐసోలేషన్ వార్డుల్లో అన్ని ఏర్పాట్లు చేసింది. గాంధీ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డుల్లో పూర్తిస్థాయిలో ప్లాన్ చేసి ఎవరైనా అనుమానితులు, పాజిటివ్ కేసులు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టారు.