Valentines Day : ఆర్య సమాజ్ తెలుసా

  • Published By: madhu ,Published On : February 14, 2019 / 03:02 AM IST
Valentines Day : ఆర్య సమాజ్ తెలుసా

Updated On : February 14, 2019 / 3:02 AM IST

హైదరాబాద్ : ఫిబ్రవరి 14..ప్రేమికుల రోజు…ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న జంటలకు ఠక్కున గుర్తొచ్చేది ప్లేస్ ఏంటీ ? అరే..ఎం భయపడకు…మేము చూసుకుంటాం..ఆర్య సమాజ్ ఉంది..కదా…అక్కడకు తీసుకెళుతాం…అంటూ తోటి స్నేహితుల భరోసా..అవును…ఎన్నో లవ్ మ్యారేజెస్‌కి ఈ ఆర్య సమాజ్ వేదికగా నిలిచింది. ఎంతో మందికి ఇక్కడి వారు వివాహాన్ని జరిపించారు. స్నేహితులే పెళ్లి పెద్దలుగా మారి సంతకాలు చేస్తుంటారు. మరి ఒకసారి ఆర్య సమాజ్ గురించి తెలుసుకుందామా ? 

మహర్షి దయానంద సరస్వతి శిష్యుల్లో ఒకరైన గిరిజానంద సరస్వతి సుల్తాన్ బజార్‌లోని బడిచౌడీలో 100 ఏళ్ల క్రితం ఆర్యసమాజాన్ని స్థాపించారు. నిజాం పాలనలో నిరంకుశత్వం, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలకు ఈ సమాజ్ వేదికగా నిలిచింది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిన తరువాత హిందూమత పరిరక్షణకు పలు కార్యక్రమాలు జరిగాయి. 

హిందూ సంప్రదాయం ప్రకారం ప్రేమ జంటలను ఒక్కటి చేస్తోంది. ఈ సమాజ్‌లో అత్యధికంగా కులాంతర వివాహాలు, పెద్దలు అంగీకరించని మ్యారేజ్‌స్ అధికంగా జరుగుతుంటాయి. ఇతర మతాలకు చెందిన వారు అయితే…మత మార్పిడి చేసి హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహాలు చేస్తున్నారు. ఇక్కడ జరిగే పెళ్లిళ్లకు చట్టబద్ధత ఉంటుంది. వివాహం చేసుకున్న వారిలో సామాన్యుడి నుండి ఎంతో మంది ప్రముఖులు కూడా ఉన్నారు. ఏడాదికి ఇక్కడ 50వేలకు పైగా వివాహాలు జరుగుతున్నాయని అంచనా. అయితే..గతంతో పోలిస్తే ఇప్పుడు మ్యారేజెస్ తగ్గుతున్నాయి. సమాజం మారుతుండడంతో తల్లిదండ్రులు కూడా మారుతున్నారు. పిల్లల ప్రేమ వివాహాలకు వారు అడ్డంకులు చెప్పడం లేదు.