దేవడా : ఓటర్ల లిస్టులో బాహుబలి, ఇడ్లీ, సెక్స్, నిట్
EPIC నెంబర్ ZEU0462135తో మోడీ ఓటు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి రసూల్ పూర మోడీకి కొడుకుగా నమోదై ఉంది. మరో EPIC నెంబర్ GBZ8252264తో బాహుబలి తండ్రి పేరు చౌగిలి.

EPIC నెంబర్ ZEU0462135తో మోడీ ఓటు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి రసూల్ పూర మోడీకి కొడుకుగా నమోదై ఉంది. మరో EPIC నెంబర్ GBZ8252264తో బాహుబలి తండ్రి పేరు చౌగిలి.
ఫ్రాంక్ వీడియోలు, ఫేక్ ఫొటోలు చూసి ఉంటారు కానీ, ఫ్రాంక్ ఓటర్లను మాత్రం ఇప్పటి వరకూ చూసి ఉండరు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్‌కు ఈ ఫేక్ ఓటర్లు ఎదురైయ్యారు. ఒకరి పేరు మీద 2, 3 ఓట్లు ఉండటం కాదు. ఏకంగా బాహుబలి, ఇడ్లీ, నిట్ సెక్స్(పోర్న్ సైట్)పేర్ల మీద ఓట్ కార్డులు నమోదై ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ అధికారులు గమనించారు.
Read Also : ఎన్నికల యుద్ధానికి మహిళా పార్టీ రెడీ: 9 స్థానాల్లో పోటీ
ఓటు కార్డుకు అప్లై చేసే వాళ్లు కాస్త ఎక్కువ చేస్తున్నారని హెచ్చరించారు. వాటిని గమనించిన వెంటనే తొలగించినప్పటికీ ఈ వార్త అప్పటికే వైరల్ గా మారింది. బాహుబలి, ఇడ్లీ, ఆపిల్, హైదరాబాద్, వీటితో పాటుగా వారి ఇంటి పేర్ల ముందు సెక్స్, ఫ.. అనే పదాలతో వెటకారం చేస్తున్నారు. ఇలా 37 పేర్లు అనుమానస్పదంగా కనిపించడంతో బూత్ లెవల్ ఆఫీసర్లను మరో సారి వెరిఫై చేయమని లిస్ట్ పంపారట.
అందులో ఇప్పటికే 18పేర్లను తొలిగించేశారు. ఇంకో చోట EPIC నెంబర్ ZEU0462135తో మోడీ ఓటు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి రసూల్ పూర మోడీకి కొడుకుగా నమోదై ఉంది. మరో EPIC నెంబర్ GBZ8252264తో బాహుబలి తండ్రి పేరు చౌగిలి. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ రీడింగ్ రూం పోలింగ్ స్టేషన్‌లో నమోదైంది. ఇంకో ఓటర్ నిట్ సెక్స్ అనే మహిళ ముషీరాబాద్ నియోజకవర్గంలోని దోమల్‌గూడలో ఓటరుగా నమోదై ఉంది. మరో ఓటర్ ఫ.. ఇంటి పేరుతో నిర్మల్ నియోజకవర్గంలో ఓట్ నమోదై ఉంది.