బండ్ల గణేష్ అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : October 23, 2019 / 01:43 PM IST
బండ్ల గణేష్ అరెస్ట్

Updated On : October 23, 2019 / 1:43 PM IST

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అరెస్ట్ అయ్యారు. డబ్బులు తీసుకుని ఇవ్వటం లేదని, అడిగితే బెదిరింపులకు దిగుతున్నట్లు ప్రముఖ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (PVP) పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరిపై ఒకరు పోటీగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. టెంపర్ సినిమా సమయంలో కోట్ల రూపాయలు తీసుకున్నాడని.. ఇంకా చెల్లించలేదనే పీవీపీ పోలీసులకు ఆధారాలు సమర్పించారు. ఆ కేసులో విచారణ చేసిన తర్వాత.. అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. 

బండ్ల గణేష్ పై 420, 448, 506, 43 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నాయి. ఒక్క పీవీపీ కేసే కాకుండా గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. జూబ్లిహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరో కేసులో విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

2013 టెంపర్ సినిమా కోసం పీవీపీ నుంచి బండ్ల 30 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అందులో ఇప్పటికీ 7 కోట్ల రూపాయలు బాకీ పడ్డాడు. కొంతకాలంగా డబ్బు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. నాకు హోం మినిస్టర్ తెలుసు, నాకు వాళ్లు, వీళ్లు తెలుసు అంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఈ క్రమంలోనే పక్కా ఆధారాలతో పోలీసులకు కంప్లయింట్ చేశారు పీవీపీ.