బతుకమ్మ పోటీలు: అందంగా అలంకరిస్తే రూ.10వేలు మీవే 

  • Published By: veegamteam ,Published On : October 1, 2019 / 03:36 AM IST
బతుకమ్మ పోటీలు: అందంగా అలంకరిస్తే రూ.10వేలు మీవే 

Updated On : October 1, 2019 / 3:36 AM IST

రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చటం ఒక కళ. కళాత్మకంగా బతుకమ్మను పేర్చి మురిసిపోతారు తెలంగాణ ఆడబిడ్డలు. నా బతుకమ్మ బాగుంది అంటే కాదు కాదు నా బతుకమ్మ బాగుంది అంటూంటారు. ఒకరిని మించి మరొకరు బతుకమ్మను అందంగా ముస్తాబు చేయటంలో పోటీలు పడతారు. బతుకమ్మను అందంగా పేర్చటంలో ఆనందాన్ని ఆస్వాదిస్తారు ఆడబిడ్డలు. బతుకమ్మను అందంగా పేర్చటం వచ్చినవారికి గుడ్ న్యూస్..మీరు ఎంత అందంగా బతుకమ్మను పేర్చితే మీకే రూ.10వేలు మీకే అంటున్నారు చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ యూనిట్. 

అందమైన బతుకమ్మను పేర్చేందుకు మహిళలకు సరికొత్తగా బతుకమ్మ పోటీలను శుక్రవారం (అక్టోబర్ 4)న నిర్వహించనున్నట్లు చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ సోమవారం (సెప్టెంబర్ 30)న ప్రకటించింది. పోటీల్లో విజేతగా నిలిచిన బతుకమ్మకు రూ. 10వేల నగదును అందిస్తామని ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మి తెలిపారు.

మొదటి బహుమతితో పాటు రెండు, మూడో బహుమతిగా రూ. 5వేలు, 2.5 వేలను అందిస్తామని పేర్కొన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం..బతుకమ్మను అందంగా పేర్చండి..రూ.10వేలను సొంతం చేసుకోండి. ఈ పోటీలో పాల్గొనాలనే ఆసక్తిగల వారు 9030904040 నంబర్‌లో సంప్రదించండి.